Health Tips: సాధారణంగా మనం రోజుల్లో నాలుగు నుంచి ఐదు సార్లు మూత్రం వెళితే మనం ఆరోగ్యంగా ఉన్నట్లనే చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువసార్లు మూత్రం వెళ్లిన కూడా మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టేనని అర్థం ఇక మనం ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అంటే మన మూత్రం బట్టి మనం ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నామో సులభంగా గుర్తిస్తారు.
ఇకపోతే చాలామంది బయటకు ఎక్కడికైనా వెళ్లిన లేకపోతే ఇంట్లో ఏదో పనులలో ఉండి మూత్రం వస్తున్న కూడా ఎక్కువ సేపు ఆపుకొని ఉంటారు. ఇలా మూత్రం వస్తున్న సమయంలో వెళ్లకుండా అలా ఆపుకొని ఉంటే మాత్రం కచ్చితంగా మీరు ప్రమాదంలో పడినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి మూత్రం వెళ్లకుండా ఆపుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏంటి అనే విషయాన్ని చూస్తే..
సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు వ్యక్తపదార్థాలు మూత్రం ద్వారా మన శరీరం నుంచి బయటకు వస్తాయి. అలాంటిది మనం మూత్రం ఆపుకోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి తద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రావడంతో మూత్రశయం మొత్తం ఎర్రగా మారి దురద వస్తుంది. ఎక్కువ మొత్తంలో యూరిన్ మన మూత్రశయంలో నిల్వ ఉండటం వల్ల మూత్రశయ సంచి సాగిపోతుంది. పెల్విక్ కండరాలు బలహీనపడి మూత్రం పై నియంత్రణ కోల్పోవడం వంటివి జరుగుతాయి. తద్వారా మనం మూత్రం వెళ్లాలనుకున్న మనకు తెలియకుండానే లీక్ అవ్వడం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే మూత్రం వచ్చిన వెంటనే ఏమాత్రం ఆపుకోకుండా వెళ్లడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.