Sravana Masam: తెలుగువారికి ఎంతో శుభప్రదమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం 5వ మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి దీనికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరు ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణుకి చేసే పూజలు ఎంతో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ శ్రావణమాసంలో ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.
ఇలా అమ్మవారిని పూజించే సమయంలో ఇలాంటి నైవేద్యాలను సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి శ్రావణమాసంలో అమ్మవారికి ఏ విధమైనటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయానికి వస్తే.. ఈ నెలలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మూడు రంగుల పుష్పాలతో పూజ చేయడం మంచిది అమ్మవారికి మందార పుష్పాలు అంటే ఎంతో మంచిది అలాగే గన్నేరు పువ్వులతో పూజ చేయడం వల్ల బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నజాజి , మల్లే వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరుతాయి. వరలక్ష్మీ వ్రతం రోజు నీలం రంగు పూలతో పూజ చేయవచ్చు కానీ మిగతా రోజుల్లో చెయ్యకూడదు.
లక్ష్మీదేవికి పంచాన్నం అంటే మిక్కిలి ప్రీతి. వాటిలో మొదటి దద్దోజనం. దద్దోజనాన్ని అన్నంలో పెరుగుతాలింపు వేసే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం మంచిది. అలాగే ఆవు పాలతో తయారు చేసిన అన్నం, పులిహోర, పులగం చక్కెర పొంగలి బెల్లం పొంగలి, శనగలు కొబ్బరి అరటి పండ్లు దానిమ్మ వంటి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు అనుకున్న పనులు జరుగుతాయి.