Wed. Jan 21st, 2026

    Shravan Amavasya:  మన హిందువులు ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమినీ కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అయితే జూలై 17వ తేదీ శ్రావణ అమావాస్య వస్తుంది. రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో హిందువులు ఎంతో పవిత్రమైన దినముగా భావిస్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన ఈ రోజున కొన్ని మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

    ఇక శ్రావణ అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తేఈ అమావాస్య రోజు పితృ దోషాలతో బాధపడేవారు పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల అంత శుభమే కలుగుతుంది. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి నది స్నానం చేయాలి అనంతరం సూర్యభగవానుడికి నీటిని తర్పణంగా వదలాలి.అలాగే ఉపవాసంతో పితృదేవతలకు తర్పణం వదిలి పేదవారికి అన్నదానం చేయటం వల్ల పితృ దోషాల నుంచి బయటపడవచ్చు.

    Shravan Amavasya: 

    ఇక ఈ అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేసే రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయడం ఎంతో మంచిది. శ్రావణ అమావాస్య రోజు రావి, మర్రి, నిమ్మ అరటి మొదలైన చెట్లను నాటడం ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుంది.మొక్కలలో దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు అందుకే శ్రావణ అమావాస్య రోజు ఈ మొక్కలను నాటడం వల్ల అన్ని శుభ ఫలితాలను కలుగుతాయని పండితులు చెబుతుంటారు.