Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు చాలా ఈజీగా లభిస్తుంది. అందుకే అరటి పండును తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తినడంలో కూడా చాలామంది ఎన్నో అపోహలను వ్యక్తపరుస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం మొదలవడంతో చాలామంది అరటిపండు తినకూడదని చెబుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వర్షాకాలం అరటిపండు ఇవ్వకూడదని భావిస్తుంటారు. మరి నిజంగానే వర్షాకాలంలో అరటిపండు తినకూడదా? చిన్నపిల్లలు తింటే ఏమవుతుంది? ఈ విషయంలో నిపుణుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే..
అరటి పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండును వర్షాకాలంలో తినడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.వర్షాకాలంలో రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉండటమే కాకుండా గుండె, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే అరటి పండును ఏమాత్రం దూరం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక వర్షాకాలంలో అరటిపండు తినే సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి. వర్షాకాలం రోజుకు ఒక అరటిపండు తినడం చాలా మంచిది. అయితే మధ్యాహ్న సమయంలో ఈ అరటిపండు తీసుకోవడం మంచిది. రాత్రిపూట తినకపోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును దూరం పెట్టడం మంచిది. అదేవిధంగా కాళీ కడుపుతో అరటిపండు తినకపోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దగ్గు, జలుబు, ఆస్తమా ఉన్నవారు మినహా మిగిలిన వారు ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా అరటిపండు తినవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.