Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. ఇలా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయం ప్రకారమే కొన్ని పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు వచ్చింది. అయితే చాలామంది ప్రతిరోజు సమీపంలోని ఆలయానికి వెళ్లి పూజలు చేసుకుని దేవుడిని నమస్కరించుకోవడం జరుగుతుంది అయితే ఆలయానికి వెళ్లాలి అంటే తప్పనిసరిగా మనం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి గుడికి వెళ్ళటం వల్ల శుభం జరుగుతుంది అని భావిస్తుంటారు అయితే చాలామంది ఎక్కడైనా ఆలయాలకు వెళ్లి వచ్చిన వెంటనే తిరిగి స్నానం చేస్తుంటారు ఇలా స్నానం చేయడం మంచిదేనా… పండితులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…
సాధారణంగా మనం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటాము ఇలా ఆలయంలోకి వెళ్లగానే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం మనలోకి వస్తుంది. తద్వారా మన మనసు ఎంతో ప్రశాంతంగా తేలికగా ఉంటుంది. అయితే ఆలయం నుంచి ఇంటికి రాగానే స్నానం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం పెరిగిపోతుంది అందుకే ఆలయం నుంచి ఇంటికి రాగానే పొరపాటున కూడా కాళ్లు కడుక్కోవడం లేదా స్నానం చేయడం వంటివి చేయకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఇక మనం ఏదైనా అంత్యక్రియల సమయంలోనూ లేదా ఏదైనా స్మశానానికి వెళ్లిన సమయంలోను తిరిగి ఇంటికి రాగానే స్నానం చేయాలని చెబుతారు లేదా కాళ్ళు అయిన కడుక్కోవాలి అని చెబుతారు ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. స్మశానంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం వ్యాప్తి చెంది ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం మనపై ఉంటుంది కనుక ఇంటికి రాగానే స్నానం చేయడం వల్ల మన నుంచి ఆయనకు ఎనర్జీ తొలిగిపోతుంది. అందుకే గుడికి వెళ్లి వచ్చినప్పుడు స్నానం చేయకూడదని స్మశానానికి లేదా ఏదైనా చావు వంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వెంటనే స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.