Shani dosha Nivaran: సాధారణంగా శని దోషం నుండి విముక్తి పొందటానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శని దోష నివారణకు ప్రతి శనివారం రోజు శని దేవుడి పూజ చేస్తూ ఉంటారు. కానీ మనం తినే నేరేడు పండ్లు కూడా శని దోష నివారణకు ఎంతో ఉపయోగపడతాయి. సాధారణంగా నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మూత్ర సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్లు శని దేవుడికి చాలా ప్రీతికరమైనది. అందువల్ల నేరేడు పనులను శని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను నల్ల నువ్వులతో కలిపి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శని దోషం తొలగిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.అంతే కాకుండా నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేయటం వల్ల భూదానం చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను బిచ్చగాళ్ళకు దానం చేయటం వల్ల మనకి ఉన్న దరిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతోపాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. అంతే కాకుండా దేవుడి ముందు పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే ఆ దేవుడి అనుగ్రహం లభించి పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. అందువల్ల శని దోషం వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారు నేరేడు పండ్లను శనిదేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేయటం వల్ల శని దోషం నుండి విముక్తి పొందవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.