Wed. Jan 21st, 2026

    Shaakuntalam Review: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకుంతలం. దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఏకంగా ఐదు భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. మహాభారతంలో ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుడి ప్రణయ ప్రేమ కావ్యాన్ని, అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకొని గుణశేఖర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథలోకి వెళ్తే

    Shaakuntalam Review: सामंथा और अल्लू अरहा ने जीता दिल, पढ़ें फिल्म शाकुंतलम  का रिव्यू | shaakuntalam full review in hindi read to know if samantha s  latest film with allu arha is

    ఒకరోజు వేటకోసం అడవికి వెళ్ళిన దుష్యంతుడు కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శాకుంతలని చూస్తాడు. ఆమెని మొదటి చూపులోని మొహిస్తాడు. ఆమెతో ప్రేమ పాటలు పాడుకుంటాడు. ఇక శాకుంతల కూడా దుష్యంతుడి ప్రేమలో పడిపోతుంది. వీరిద్దరూ గాందర్వ వివాహం చేసుకుంటారు. ఇక రాజ్యానికి వెళ్లి తిరిగి వచ్చి తీసుకొని వెళ్తానని యువరాణిగా పరిచయం చేస్తానని శాకుంతలకి మాట ఇస్తారు. తరువాత రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడు తిరిగిరాడు. దీంతో గర్భవతి అయిన శకుంతల తన గుర్తింపు కోసం పోరాటం చేస్తుంది. ఆమెని దుష్యంతుడు ఎందుకు మరిచిపోయాడు. చివరికి భార్యగా శకుంతలని స్వీకరించడా అనేది కథలో భాగంగా ఉంటుంది.

    Samantha Ruth Prabhu's mythological drama 'Shaakuntalam' new release date  out, Samantha Ruth Prabhu, Shaakuntalam, release date, movie review, Dev  Mohan, April 14, tollywood

    ఇక మూవీలో శాకుంతల పాత్రలో సమంత అద్భుతమైన నటనతో మెప్పించింది.  దుష్యంతుడి పాత్రకి దేవ్ మోహన్ పూర్తి న్యాయం చేశారు. కథలో భాగంగా వచ్చే అన్ని పాత్రలు ఎవరి పరిధి మేరకు వారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరికీ ఓంక పెట్టడానికి లేదు. అయితే అసలు సమస్య అంత కథ, కథనంలోనే ఉంది. అందరికి తెలిసిన కథనే దర్శకుడు గుణశేఖర్ తెరపై ఆవిష్కరించారు. ఇలాంటి కథని తెరపై ఆవిష్కరించినపుడు ఎంత ఎమోషనల్ గా ప్రేక్షకులని కథకి, పాత్రలకి కనెక్ట్ అయ్యే విధంగా చేసాము అనేదాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

    Shaakuntalam: Shocking Cost of Samantha's Jewellery is Out

    ఈ విషయంలో గుణశేఖర్ తడబడ్డాడు అని చెప్పాలి. స్లో నేరేషన్, ఎంగేజ్ చేయని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కాలేకపోతాడు. దానికి తోడు మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ కోణంలో మెప్పించాలేదనే మాట ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ కోసం భారీగా ఖర్చు చేసిన చాలా ఆర్టిఫీషియల్ గా గ్రాఫిక్స్ వర్క్ ఉందని చెప్పాలి. పాత్రల పెర్ఫార్మెన్స్ వరకు చూడాలంటే సినిమాకి ఒకసారి వెళ్ళొచ్చు.. అయితే లాంగ్ రన్ లో ఏ మేరకు ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తుంది అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది.