Wed. Jan 21st, 2026

    Dreams: సాధారణంగా ప్రతి ఒక్క మనిషి నిద్రపోతున్న సమయంలో కొన్ని రకాల కలలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి తెల్లవారి కలలు రాగ మరికొందరికి పడుకున్న వెంటనే కలలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్నిసార్లు ఎంతో మంచి కలలు రాగా మరికొన్ని భయంకరమైనటువంటి కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు చాలామంది అవి నిజంగానే జరుగుతాయేమోనని భయపడుతూ ఉంటారు. ఇక కలలో కొన్ని రకాల జంతువులు పక్షులు నీళ్లు వంటివి కూడా వస్తుంటాయి అయితే మన కలలో కనుక కోతులు కనిపిస్తున్నాయి అంటే జరగబోయేది ఇదేనని పండితులు చెబుతున్నారు.

    కలలో కనక కోతులు కొట్టుకుంటూ కనిపించడం లేదా తింటూ కనిపించడం జరుగుతుంది అంటే మీరు కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి కలలో కనక కోతులు కొట్టుకుంటూ కనిపిస్తున్నాయి అంటే త్వరలోనే మీ కుటుంబంలో మీకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని కొన్నిసార్లు ఆ గొడవల కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా కావాల్సి వస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది ఇక కోతులు కనుక తింటూ ఉన్నట్లు కనుక కనిపిస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని సంకేతం.

    ఇక కోతులు కనుక ఈత కొడుతూ ఉన్నట్టు కనిపిస్తే చాలా శుభంగా పరిగణిస్తారు. మీరు గత కొద్ది రోజులకు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి బయటపడుతున్నారని తెలిపే సంకేతం అని పండితులు చెబుతున్నారు. ఇక కోతి కనుక నవ్వుతూ ఉన్నట్లయితే మీకు మంచి సమయం ఆసన్నమైందని అర్థం. ఒకవేళ కోతులు కనుక గుంపులు గుంపులుగా వస్తే మీకు త్వరలోనే దన ప్రాప్తి కలగబోతుందని సంకేతం.