Tue. Jan 20th, 2026

    Satyam Rajesh: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ కమెడియన్స్‌లో సత్యం రాజేష్ ఒకరు. సత్యం, మిర్చి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి ఫాంలో ఉన్నాడు. క్షణం లాంటి కొన్ని సినిమాలలో సీరియస్ రోల్స్ కూడా చేశాడు. ఇప్పుడు సత్యం రాజేష్ నటించిన పొలిమేర 2 రిలీజ్ కాబోతుంది. గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషలలో కథ, అందులోని సన్నివేశం డిమాండ్ చేస్తే నటీనటులు ఒంటిపై ఏమీ లేకుండా కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు.

    గతంలో కొన్ని సినిమాలలో హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నగ్నంగా నటించారు. ఇప్పుడు సత్యం రాజేష్ కూడా అలా నగ్నంగానే నటించారు. ముఖ్య పాత్ర‌లో తెర‌కెక్కిన పొలిమేర 1 ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. చేత‌బ‌డుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆ సినిమాతో న‌టీన‌టీలంద‌రికీ మంచి పేరు వచ్చింది.

    satyam-rajesh-tollywood-popular-comedian-who-acted-naked
    satyam-rajesh-tollywood-popular-comedian-who-acted-naked

    Satyam Rajesh: నా స‌న్నివేశాలు తీస్తున్నప్పుడు నాకే భ‌య‌మేసింది.

    ఈ క్రమంలో ఇప్పుడు పొలిమేర‌-2 ని తెర‌కెక్కించారు. ట్రైలర్ రిలీజైయ్యాక ఈ సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగాయి. దాంతో మొదటి భాగం లా కాకుండా ఈ చిత్రాన్ని నేరుగా థియేట‌ర్ల‌లోనే విడుదల చేస్తుంది చిత్రబృందం. ఈ నేప‌థ్యంలో షూటింగ్ సమయంలో తన అనుభ‌వాల్ని స‌త్యం రాజేష్ మీడియాతో పంచుకున్నారు. ‘పొలిమేర మొద‌టి భాగం షూటింగ్ స‌మ‌యంలో నా స‌న్నివేశాలు తీస్తున్నప్పుడు నాకే భ‌య‌మేసింది.

    అర్ద‌రాత్రి రెండున్న‌ర గంటల స‌మ‌యంలో స్మ‌శానంలో కొన్ని సీన్లు షూట్ చేశాము. కొన్ని స‌న్నివేశాల్లో న‌గ్నంగానూ న‌టించాను. లైట్ల‌న్నీ ఆపేసి ఒకే ఒక్క లైట్ లో సీన్లు తీసారు. ‘పొలిమేర 2′ లో కొన్ని భ‌యపెట్టే సీన్స్ ఉన్నాయి. హార‌ర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ సినిమాని విదేశాల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. నా జీవితంలో ఇదే పెద్ద మూవ్ మెంట్’ అని చెప్పుకొచ్చాడు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.