Wed. Jan 21st, 2026

    Saripoda Ee Dasara: దసరాకి ఈటీవీ టీం మంచి ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు బ్రహ్మాజీ, అలీ, శ్రీదేవీ విజయ్ కుమార్, సంగీత వంటి వారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్‌ను నందు తన ఎనర్జిని రెట్టింపు చేసి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో నందు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాడు.

    జాను మాస్ పర్ఫామెన్స్, ఆట సందీప్ జ్యోతి డివోషనల్ పర్ఫామెన్స్, సింగింగ్ పర్ఫామెన్స్‌లు ఇలా అన్నీ కూడా హైలెట్ కానున్నాయి. ఇక కామెడీ యాంగిల్‌లో ఆది, బ్రహ్మాజీ, అలీ ట్రాకులు కూడా ఉన్నాయి. అన్నింట్లో కెల్లా రియాజ్, నరేష్ జాతకాలు చెప్పే ఎపిసోడ్ మరింత హిలేరియస్‌గా ఉండేట్టు కనిపిస్తోంది.

    పంచాంగం గురించి మాట్లాడుతూ.. ఒక్కొక్కరి జాతకాలు చెప్పే బ్లాక్ బాగుండేలా కనిపిస్తోంది. జాతకాలు చెప్పే ఎపిసోడ్, మాస్ డ్యాన్సులు, అమ్మవారి శక్తిని చాటేలా చూపించే భక్తి పాటలకు ఆర్టిస్టులు వేసే స్టెప్పులు ఇలా అన్నీ కలిపి రేపు ‘సరిపోదా ఈ దసరాకి’ ఈవెంట్ అందరినీ అలరించబోతోంది.