Thu. Jan 22nd, 2026

    Sharath Babbu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై కాస్త కూడా సానుభూతి చూపించకుండా ఓ హీరోయిన్‌ను ఆయన సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్నారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అద్భుతమైన పాత్రలను పోషిస్తూ తెరపై కనిపిస్తున్నంత సేపు వారి వ్యక్తిగత విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు.

    కానీ, ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడో, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైనప్పుడో రక రకాల విషయాలు ప్రచారంలోకి వస్తాయి. అప్పుడే వాటిని నిజా నిజాలేంటో తెలుసుకోకుండా ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు కూడా శరత్ బాబు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆయనకి హీరోయిన్ నమితతో పెళ్లి జరిగిందని వార్త ఒకటి వైరల్ అవుతోంది.

    Sarath Babu really married that heroine secretly..?
    Sarath Babu really married that heroine secretly..?

    Sharath Babbu: అవకాశం వస్తే మళ్ళీ సినిమాలలో నటించడానికి ఆసక్తి

    అయితే ఈ వార్తలు అటు ఇటూ తిరిగి నమిత చెవిన పడ్డాయి. దాం నమిత స్పందించింది. ఇవన్నీ కేవలం పుట్టించిన పుకార్లేనని..మా ఇద్దరికీ పెళ్లి జరిగింది..సహజీవనం చేస్తున్నాము అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. నమితకి సినిమాల్లో అవకాశాలు తగ్గాక తమిళ్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. అవకాశం వస్తే మళ్ళీ సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది.

    కాగా, ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. త్వరలో ఆయన పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తారని సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. గతకొంతకాలంగా సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న శరత్ బాబు ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు చాలా తక్కువమందికి తెలుసు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.