Wed. Jan 21st, 2026
    Sapthami GowdaSapthami Gowda

    Sapthami Gowda: కన్నడంలో తెరకెక్కిన కాంతారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హీట్ ని ఈ సినిమా సొంతం చేసుకొంది. ఇక ఈ మూవీ కన్నడ హీరో రిషబ్ శెట్టికి అటు దర్శకుడిగా, ఇటు హీరోగా కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రంగా కాంతారా మూవీ మారింది.

    Sapthami Gowda
    Sapthami Gowda

    ఇక ఈ సినిమాతో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ కి కాంతారా మూవీ సరికొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. కెరియర్ లో రెండో సినిమానే ఏకంగా కాంతారా లాంటి పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశాన్ని సప్తమి గౌడ సొంతం చేసుకోవడం నిజంగా విశేషమని చెప్పాలి.

    Sapthami Gowda
    Sapthami Gowda

    ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ కన్నడ భామ ఇప్పుడు మాతృభాషలో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కాంతారా ఫ్రీక్వెల్లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

    Image

    ఈ మధ్యకాలంలో కన్నడ హీరోయిన్స్ సౌత్ లో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా మంగుళూరు భామలు అయితే దేశవ్యాప్తంగా తమ అందంతో నటనతో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్లు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు సప్తమి గౌడ కూడా అదే రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకొనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

    Image

    ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ట్రెడిషనల్ లుక్ లో సప్తమి గౌడ అచ్చం దేవకన్యలా ఉందని మాట ఇప్పుడు కన్నడ అభిమానుల నుంచి వినిపిస్తుంది. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ సప్తమి గౌడలో ఉన్నాయని కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం.