Categories: EntertainmentLatest

Sapthami Gowda : ఆ హీరో భార్యపై పరువు నష్టం కేసు వేసిన కాంతార బ్యూటీ

Sapthami Gowda : కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజుకో వివాదంతో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ఈ మధ్యనే స్టార్ హీరో దర్శన్‌ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఇక లేటెస్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. యంగ్ హీరో యువ రాజ్‌కుమార్ భార్య శ్రీదేవి బైరప్పపై ‘కాంతార’ ఫేమ్ నటి సప్తమి గౌడ రూ.10 కోట్ల పరువు నష్టం కేసు ఫైల్ చేసింది. ఈ కేసుతో మరోసారి కన్నడ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మరింది.

sapthami-gowda-files-defamation-case-against-kannada-hero-wife

‘యువ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు యువ రాజ్ కుమార్ . యువ రాజ్ కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సోదరుడి కుమారుడు. ఈ మూవీలో యువ రాజ్ కు జోడీగా సప్తమి యాక్ట్ చేసింది. ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా ఫర్వాలేదనిపించింది. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఈ సినిమాతో యువ రాజ్ కి గట్టి దెబ్బే తగిలింది. రీసెంట్ గా యువ రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి డివోర్స్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ డివోర్స్ న్యూస్ కన్నడ నాట సెన్సేషన్ అయ్యింది. అయితే డివోర్స్ నోటీసులు అందిన నాటి నుంచి శ్రీదేవి మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తోంది. తమ విడాకులకు నటి సప్తమి గౌడ‌ కారణమంటూ ఆమె ఆరోపిస్తోంది. తన భర్తకు సప్తమితో వివాహేతర సంబంధం ఉందని శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సప్తమి గౌడ,తన భర్త ప్రేమలో ఉన్నారని తాను అమెరికా వెళ్లినప్పుడు వీరిద్దరూ లివింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చింది. సప్తమి కోసం తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం కూడా నా భర్త చేశాడని చెప్పింది శ్రీదేవి.

sapthami-gowda-files-defamation-case-against-kannada-hero-wife

అయితే తాజాగా ఈ ఆరోపణలపై నటి సప్తమి సీరియస్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా శ్రీదేవి భైరప్పపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీంతో శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దానితో పాటే సప్తమి పరువునష్టం దావా కూడా వేసింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇలాంటి ఆరోపణల వల్ల తన పరువకి నష్టం వాటిల్లిందని రూ.10 కోట్లు చెల్లించాలని సప్తమి డిమాండ్ చేసింది. అంతే కాదు మీడియా ఎదురుకుగా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలిపింది.

Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

59 seconds ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

2 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.