Makara Sankranti: హిందూ ప్రజలు జరుపుకునే పండుగలు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైనది ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భోగి మకర కనుమ ఇలా మూడు రోజులపాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రంగురంగు ముగ్గులను వేసి ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం పూర్తి చేసుకొని ఉత్తరాయన కాలంలోకి అడుగుపెడతారు.
దీంతో అన్ని శుభ పరిణామాలే జరుగుతాయి. ఇక మకర సంక్రాంతి రోజు దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందనే సంగతి మనకు తెలిసిందే. మకర సంక్రాంతి రోజు దానం చేయటం వల్ల అధిక రెట్ల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజు ఉదయమే పవిత్ర నది స్నానాలను ఆచరించి పూజ కార్యక్రమాలను చేసుకోవాలి అనంతరం దానధర్మాలను చేయటం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు అయితే మకర సంక్రాంతి రోజు నువ్వులను దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అయితే సంక్రాంతి పండుగ రోజు దానం చేసే నువ్వులు తెలుపు నువ్వులు అయితే మంచిదా నలుపు రంగు నువ్వులు అయితే మంచిదా అనే సందిగ్ధంలో చాలామంది ఉంటారు.నిజానికి సంక్రాంతి పండుగ రోజు నల్ల నువ్వులు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే వీటిని దానం చేయటం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో పాటు శనీశ్వరుడి ఆశీస్సులు కూడా మనపై ఉంటాయి అందుకే నీటిలో కాస్త నల్ల నువ్వు కలిపి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో పాటు శనీశ్వరుని ఆశీస్సులు కూడా ఉంటాయి ఒకవేళ నల్లని నువ్వులు లేని పక్షంలో తెల్లని నువ్వులను దానం చేయొచ్చు తెల్లని నువ్వులను దానం చేయడం వల్ల సూర్య భగవానుని ఆశీస్సులు పొందగలము.