Sankarsh Chanda : 16 ఏళ్ల వయసు పడి పడి లేచె మనసు అని ఓ రచయిత చెప్పినట్లు…టీనేజ్ లో జల్సా చేయాలని, స్నేహితులతో షికార్లు, సినిమాలు, పబ్బులు, గబ్బులు, అమ్మాయిలతో తిరగడాలు, ప్రేమలు, బ్రేకప్ లు అని కుర్రాళ్ళు టైం పాస్ చేస్తుటారు. తమ జీవితంలో ఎంతో విలువైన టీనేజ్ ను చాలా మంది యువకులు వృథా చేస్తుంటారు. దాదాపుగా 16, 17 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు. అరే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వదిలిపెట్టు కెరీర్ మీద దృష్టిపెట్టు అని తల్లిదండ్రులు నెత్తినోరూ బాదుకున్నా నాకేం వయసు అయిపోయింది, ఇంకా టైం ఉందని సమాధానమిస్తే వెరీ ఇంటెలిజెంట్లుగా ఫీల్ అవుతుంటాము. అందుకే అత్యసరు జీతంతో ఉసూరుమంటూ జీవితాన్ని సాగిస్తున్నాము. కానీ ఇదే వయసులో ఉన్న యువకుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
సంకర్ష్ చందా ఓ సక్సెస్ ఫుల్ యంగ్ మ్యాన్. 17 ఏళ్ల వయస్సులో స్టాక్ మార్కెట్ గురుంచి తెలుసుకున్నాడు. ఆ మార్గంలోనే వెళ్లి అతి పిన్న వయసులోనే అంటే, 24 ఏళ్లలోనే రూ.100 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.ఇదంతా ఓవర్ నెట్ లో రాలేదు దీని కోసం ఎంతో కష్టపడ్డాడు సంకర్ష్.
2016 లో హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేశాడు సంకర్ష్. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెల్దామనుకున్నాడు అప్పుడే తన మైండ్ లో అద్భుతమైన ఐడియా వచ్చింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నాడు మొదట తన దగ్గర కేవలం 2000 రూపాయల మాత్రమే ఉన్నాయి. వాటితోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ రెండు వేల తోనే తన స్టాక్ మార్కెట్ ప్రయాణం ప్రారంభమైంది తన ప్లాన్ వర్క్ అవుట్ అయింది. అంచనా కరెక్ట్ అయింది. ఏడాదిలోనిఆ 2వేలు 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టించింది. దాన్ని అలాగే రెండు సంవత్సరాలు కొనసాగించాడు ఆ తర్వాత రూ.13 లక్షలకు పెట్టుబడి చేరింది. తన కొద్ది మొత్తంలో పెట్టుబడి భారీగా ఆదాయం తీసుకొచ్చి పెడుతుండడంతో స్టాక్ మార్కెట్ పైన మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.
2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సు జాయిన్ అయ్యాడు. వన్ ఇయర్ బాగానే పూర్తయింది. ఆ తర్వాత మళ్లీ స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ చూపాడు. చదువుకు మొత్తం ఫుల్ స్టాప్ చెప్పి , బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. దీనికోసం స్టాక్ మార్కెట్ లో తాను సంపాదించిన 8 లక్షల షేర్లను విక్రయించాడు. ఆ సొమ్మును మళ్ళీ పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోలేదు. స్టాక్ మార్కెట్లో ఇప్పటివరకు తను సంపాదించిన ఆస్తుల విలువ రూ. 100 కోట్లు వరకు ఉంటుంది. ఈ విషయాన్నీ సంకర్ష్ చందా స్వయంగా చెప్తున్నాడు.
ఏదేమైనా స్టాక్ మార్కెట్ అంటే భయపడే ఈ రోజుల్లో.. నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఆస్తులు సంపాదించాడు. ఇది చాలా గొప్ప విషయం. తన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సంకర్ష్.
Meet Sankarsh Chanda – the Hyderabad resident who turned a risky investment into a 100 crore fintech company, Startup Savart #ReciteYou #SankarshChanda #FintechFounder #StartupSavart #Investing #Entrepreneurship #SuccessStory #Motivation #InspirationalStory #Startup pic.twitter.com/ksVNzhIAMo
— Recite You™ (@Recite_You) February 27, 2023