Mon. Jan 19th, 2026

    Prabhas-Fauzi: ప్రభాస్ ఫౌజీపై సందీప్ రెడ్డి ఎఫెక్ట్..ఏమవుతుందో? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజై..డివైడ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో కాకపోయి ఉంటే ఫలితం ఎలా ఉండేదో గానీ, 5 సినిమాలతో పోటీపడి అన్నిటికంటే ముందు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలనుకున్న ది రాజాసాబ్ ఫ్లాప్ టాక్‌తో సాగుతున్నాడు.

    ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో దర్శకుడు మారుతి ఇచ్చిన హైప్..హీరోయిన్స్‌తో చేసిన ప్రచారం ది రాజాసాబ్ మూవీపై భారీగా అంచనాలను పెంచాయి. కట్ చేస్తే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఇంకా, కొన్నిచోట్ల ఫ్లాప్ అని తేల్చేశారు. ఇక, ఆ తర్వాత జనవరి 12న వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో చాలాచోట్ల ప్రభాస్ సినిమాను ఎత్తేశారు.

    sandeep-reddy-vanga-effect-on-prabhas-fauzi
    sandeep-reddy-vanga-effect-on-prabhas-fauzi

    Prabhas-Fauzi: ఎటొచ్చి ఇబ్బందల్లా ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి మీదే పడబోతోంది. 

    రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమాలకి పాజిటివ్ టాక్ రావడంతో పూర్తిగా రాజాసాబ్ సైడ్ అవ్వాల్సి వచ్చింది. మారుతి మాత్రం కథ లోతును అర్థం చేసుకోలేకపోయారని, నా తప్పేమీ లేదంటున్నాడు. మరో వైపు ప్రభాస్ గనక వేలు పెట్టకపోతే మారుతి హిట్ సినిమానే ఇచ్చేవాడని మాట్లాడుతున్నారు.

    ఇలాంటి, పరిణామాలలో ప్రభాస్ చేస్తున్న నెక్స్ట్ సినిమాల దర్శకుల మీద ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇటీవల స్పిరిట్ షూటింగ్ మొదలై, శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని వదిలిన సందీప్ రెడ్డి వంగా..మరోసారి స్టార్టింగ్‌లోనే తన మ్యాడ్‌నెస్‌ని చూపించాడు. సినిమాపై ఊహించని అంచనాలు పెంచేశాడు. ఎటొచ్చి ఇబ్బందల్లా ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి మీదే పడబోతోంది. ఇంకా, ఈ సినిమాకి సంబందించి సరిగ్గా అప్‌డేట్స్ లేవు. ఎలాంటి డీటైల్స్ బయటకి రావడం లేదు. ది రాజాసాబ్ ఫ్లాప్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కువగా పడబోయేది ఫౌజీ సినిమా మీదే అంటున్నారు. మరి, దీన్నుంచి దర్శకుడు హను రాఘవపూడి ఎలా తప్పించుకుంటాడో చూడాలి. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఇందులో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.