Wed. Jan 21st, 2026

    Samyuktha Menon : సినిమా ఇండస్ట్రీతో ప్రేమలో పడియానంటూ మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ తాజాగా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని పలకరించింది సంయుక్త. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర బాగా హైలెట్ కావడంతో ఇప్పుడు వరుసగా క్రేజీ ఆఫర్స్‌ను అందుకుంటున్నారు.

    samyuktha-menon-intresting-comments-on-cinema-industry
    samyuktha-menon-intresting-comments-on-cinema-industry

    నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ కూడా సంయుక్తకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం సార్‌లో హీరోయిన్‌గా నటించారు. త్వరలో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

    Samyuktha Menon : సినిమాలతో ప్రేమలో పడిపోయా..

    ఈ సందర్భంగా సంయుక్త, తాను ఇండస్ట్రీకొచ్చినప్పటి సంగతులను ఎంతో ఆసక్తిగా చెప్పారు. కేరళలోని ఓ పల్లెటూళ్లో పుట్టారు సంయుక్త. అయితే, ఆమె సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా సక్సెస్ అవుతాని ఎంతమాత్రం ఊహించలేదట. మొదటి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నారట. కానీ, ఇక్కడ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ, ప్రేమ బావుందని..ఆ కారణంగానే ఇక్కడ నిలబడగలిగానని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క సినిమాతో చిత్ర పరిశ్రమకి గుడ్ బై చెప్పాలనుకున్న సంయుక్త మేనన్ ఆ తర్వాత నుంచి సినిమాలతో ప్రేమలో పడిపోయానంటూ వెల్లడించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.