Wed. Jan 21st, 2026

    Samyuktha Menon : టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి పట్టుమని నాలుగు సినిమాలను కూడా చేయలేదు. అప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మలయాళ బ్యూటీలు చాలా అందంగా ఉంటారు. అందుకే పెద్దగా టాలెంట్ లేకపోయినా అందంతో హీరోయిన్‌గా సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ సంయుక్తా మీనన్ కి అందంతో పాటు మంచి పర్ఫార్మర్ అనే పేరు కూడా బాగానే వచ్చింది.

    దాంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తోంది. మామూలుగా అయితే, మనవాళ్ళు ఒకటీ లేదా రెండు సినిమాల తర్వాత ఇదే హీరోయిన్‌కి అవకాశాలు ఇవ్వాలా వద్దా అని ఆలోచనలో పడతారు. కానీ, సంయుక్తా మీనన్ ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న సంయుక్తా ఆ తర్వాత బింబిసార, సార్ మూవీస్‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.

    samyuktha-menon-comments viral in social media
    samyuktha-menon-comments viral in social media

    Samyuktha Menon : సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ను అస్సలు కేర్ చేయను..

    దాంతో మన టాలీవుడ్ మేకర్స్ అలాగే హీరోలు సంయుక్తాని లక్కీ హీరోయిన్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సరసన నటిస్తున్న ఈ బ్యూటీ రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన లుక్ రిలీజ్ చేస్తే అందులో తన ఫొటో లేదని ఫీలైంది.

    అదే విషయాన్ని ట్వీట్‌లో మెన్షన్ చేస్తూ ఫీలైంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా బూతద్దంలో పెట్టి చూస్తూ రక రకాలుగా ప్రచారం చేశారు. దానిపై తాజాగా స్పందించిన సంయుక్తా మీనన్ ..సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ను అస్సలు కేర్ చేయను అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాంటి వాటివి నా ఏరియాలోకి రావంటూ రియాక్ట్ అయింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.