Sameera Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది నటి సమీరా రెడ్డి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఈ భామ ముంబై బ్యూటీ అయినప్పటికీ ఆమె తండ్రి తెలుగువాడు. మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా తెలుగులో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఫస్ట్ సినిమా హిట్ కాకపోయినా తన అందం , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో జై చిరంజీవ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత మరోసారి ఎన్టీఆర్ తో అశోక్ మూవీ చేసింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. ఆతర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత రానా చేసిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ సాంగ్ పెర్ఫార్మ్ చేసింది. తెలుగు కంటే ఈ బ్యూటీ హిందీ సినిమాల్లోనే ఎక్కువాగా కనిపించింది. తమిళంలో సూర్య సన్నాఫ్ కిషన్ సినిమాలో ఆమె నటతో ఇప్పటికీ ఆమె అందరికీ గుర్తుండిపోయింది.
ఇదిలా ఉంటే 2013 తర్వాత సమీరా రెడ్డి మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. తన తల్లితో కలిసి ఫన్నీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ ను అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. గతంలో సినిమాల్లో నటించేప్పుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తెలిపింది.
“హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు నా శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ టైంలో నన్ను కొంతమంది బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు బూబ్ జాబ్ సర్జరీ చేయించుకుంటున్నారు నీకేమైంది అని నన్ను చాలా బలవంతం చేసేవారు. కానీ, నాకు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు అని చెప్పేదాన్ని. అయినా వారు వినేవారు కాదు. ఆ టైంలో చాలా ఫీల్ అయ్యాను. నిజానికి ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ చేయించుకునే వారికి వ్యతిరేకిని కాను. వారిని తప్పుపట్టను. కానీ నా ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసుకోగలను.కొంత మంది హీరోయిన్లు వారి ఏజ్ దాచేస్తుంటారు. కానీ నేను అలా కాదు”అని ఎమోషనల్ అయ్యింది సమీరా రెడ్డి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.