Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ పై సమంత కొద్ది రోజుల నుంచి ఫుల్ బిజీగా ఉంది. సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్ళే బాద్యతని తీసుకొని ప్రమోషన్ చేస్తోంది. పౌరాణికం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, కంప్లీట్ లవ్ డ్రామాగా శాకుంతలం ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉండటంతో ఏ మేరకు ప్రేక్షకులకి చేరువ అవుతోంది అనేది చెప్పలేని విషయం.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ప్రీమియర్ షోలని ఇప్పటికే ప్రదర్శించగా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా పార్టిసిపేట్ చేసిన సమంత తాజాగా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలియజేసింది. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇవాళ ఎంఎల్ఆర్ఐటీలో జరగాల్సిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంలేదని తెలిపారు.
వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. శాకుంతలం టీమ్ తో కలిసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరినీ మిస్సవుతున్నానని సమంత విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 13న మీడియాకి ప్రత్యేకంగా ఈ సినిమాని ప్రీమియర్స్ వేసి చూపించబోతున్నట్లు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.