Samantha Ruth Prabhu : సౌత్ సూపర్ స్టార్ సమంతా రూత్ ప్రభు మైయోసిటిస్‌తో పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా ఏమాత్రం కుంగిపోకుండా తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకుంటూ మరోవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటూ నేటితరం అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్న సమంత క్యూరేటెడ్ ఆటో-ఇమ్యూన్ డైట్ తో పాటు కష్టతరమైన వర్కవుట్స్ చేస్తూ తన బాడీ ఫిట్నెస్ కోసం శిక్షణ తీసుకుంటుంది. . తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో , పండ్లు, బాదంపప్పులు, కొన్ని సూపర్ ఫుడ్స్ తో కూడిన ఆహారంతో ఉన్న పిక్ ను పంచుకుంది. అదే విధంగా ఆమె తన ట్రైనర్‌తో కలిసి వ్యాయామాలు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. సమంత వర్కౌట్ చేస్తున్న విధానం చూసి ఫ్యాన్స్ త్రిల్ అవుతున్నారు. తన బాడీ ఫిట్నెస్ కోసం ఆమె పడుతున్న కష్టాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు.తన జీవితంలోని ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆనందించడానికి ప్రయత్నించే అతి కొద్దిమంది తరల్లో సామ్ పేరు ఉంటుంది.
నటి ఇటీవల కొరియాలో తన ఆటో-ఇమ్యూన్ డిజార్డర్‌కు చికిత్స పొందిందని పుకారు వచ్చింది. అంతే కాదు ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆమె టీమ్ రంగంలోకి దిగి అసలు విషయాన్ని క్లియర్ చేసింది. కెరీర్ విషయంలోనూ సామ్ మంచి ఉత్సాహంగా ఉంది.
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన రాబోయే చిత్రం శాకుంతలం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీ లో , దేవ్ మోహన్, మోహన్ బాబు, మధు, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సమంత బిజీగా ఉంది. తన ప్రచార విధుల మధ్య, సమంతా తన జిమ్ డైరీల నుండి ఒక చిన్న వీడియోను పంచుకుంది మిడ్‌వీక్‌లో జిమ్‌కి వెళ్లడం ప్రారంభించాల్సిన అన్ని రకాల ఫిట్‌నెస్ ఇన్‌స్పోను అందించింది.
సమంత ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు, తరచుగా ఆమె జిమ్‌లో కనిపిస్తుంటుంది. ఈ బ్యూటీ కష్టతరమైన వ్యాయామాలు, యోగా ఆసనాలతో అందరిని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా సామ్ వరుణ్ ధావన్ తో కలిసి సీటాడెల్ ప్రాజెక్టులో నటిస్తోంది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ఖుషీ మూవీ కూడా చేస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.