Samantha : ఆ ఫోటో పెట్టి..ఆ తర్వాత డిలీట్ చేసింది

Samantha : సమంత, చైతుల విడాకుల ప్రకటన అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. వీరిద్దరు విడిపోయి నాలుగేళ్లు అవుతున్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందర్భం వచ్చిన ప్రతిసారి వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్యనే మయోసైటిస్‌ కు ట్రీట్మెంట్ తీసుకున్న సామ్ మళ్లీ తెరముందు రెట్టింపు ఉత్సాహంతో కనిపించేందుకు తెగ కష్టపడుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ ను నిర్వహిస్తోంది.

samantha-deleted-latest-semi-naked-story-from-instagram

ఇదిలా ఉంటే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా సామ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సామ్ సాధారణంగా ఆ ఫోటో షేర్ చేసి ఉండవచ్చు కానీ దాన్ని నాగచైతన్యకు లింక్ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆవిరి చికిత్స తీసుకుంటున్న ఫోటోను పెట్టింది. అది కాస్త ట్రోల్ అయ్యింది. ఇక సమంత గురించి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

samantha-deleted-latest-semi-naked-story-from-instagram

 

సమంతకు మయోసైటిస్ ఉందని తెలుసు. దీని కోసం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటోంది. ఈసారి సామ్ సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఇన్ఫ్రారెడ్ సోనా అనే కొత్త మెథడ్ లో చికిత్స తీసుకుంటోంది. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దిగిన ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ఈ ట్రీట్మెంట్ వల్ల కలిగే బెనిఫిట్స్ ను వివరించింది. అయితే సామ్ ఈ ఫోటోలో సెమీ నేక్డ్ గా ఉంది. ఆ ఫోటో కొద్దిసేపటికే వైరల్ అవ్వడం ట్రోల్స్ మొదలెట్టడంతో డిలీట్ కూడా చేసిందని తెలుస్తోంది.

samantha-deleted-latest-semi-naked-story-from-instagram

ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తోన్న సమంతకు మరో రెండు బంపర్ ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. తన పుట్టినరోజు సందర్భంగా ఓ లేడీ ఓరియంటెడ్ స్టోరీతో తెరముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేసింది సామ్. తన సొంత బ్యానర్ పైనే ఈ మూవీ తీయబోతోంది.అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మరో మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా చేయనున్నాడు. ఈ మూవీని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.