Samantha-Chaitanya : విడాకులతో విడిపోయినా సమంత, నాగచైతన్యల వ్యవహారం రోజూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే సాగుతోంది. విడాకుల అనంతరం సమంత తన మాజీ భర్తపైన ఎమోషన్ కామెంట్స్ చేసింది. వారి బంధం గురించి ఫైర్ అయ్యింది. ఓ షోలో ఏకంగా మా ఇద్దరూ ఒక గదిలో ఉంటే అక్కడ కత్తులు ఏమీ ఉండకుండా చూసుకోవాలి అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సామ్ చైతో తన బంధం ఎలా ఉండేదో చెప్పేసింది. దీంతో విరిద్దరి విడాకులకు కారణమేంటో ఫ్యాన్స్ కు ఓ రంగా అర్థమయ్యింది. అనంతరం సమంత అనారోగ్యంతో పోరాడుతోందని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోందని , ఈ భామ హిట్ కోసం ఎన్నో పీట్లు చేస్తుందని రోజుకో వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. సామ్ చైను మరిచిపోలేదని, అందుకే టాటూలను భద్రంగా ఉంచుకుందని వర్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మరోవైపు నాగచైతన్య , యువ నటి శోభితతో రిలేషన్ లో ఉన్నాడని, డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందని రోజూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే సమంత నటించిన శాకుంతలం సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. శాకుంతలం ఇంతలా ఫ్లాప్ అవ్వడానికి నాగ చైతన్యనే కారణమని సమంత సామ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే సామంత మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ బాంబు పేల్చింది. సమంత చేసిన ఓ షేర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. త్వరలో నాగ చైతన్య సినిమా విడుదల అవుతున్న నేపథ్యలో తాను గేమ్ స్టార్ట్ చేసినట్లుగా ఈ పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.
మే 12 న నాగ చైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇదే క్రమంలో తాజాగా చైతూ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఇంటర్వ్యూలో చై మాట్లాడుతూ… ‘‘నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి బాధలు లేవు..ఏ విషయంలోనూ బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నాకు ఓ గుణపాఠాన్ని నేర్పించింది.కొన్ని సినిమా లతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను” అని చై తెలిపాడు. ఇదే సందర్భంలో.. సమంత తన ఇన్‌స్టా వేదికగా ‘టార్చర్ టైమ్’ అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి వార్ మొదలైందని నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
సమంత తన ఇన్‌స్టాలో ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ.. ఐస్ ముక్కలు ఉన్న టబ్‌లో ఉన్న పిక్ ను షేర్ చేసింది. అయితే ఇది తన వ్యాధి నివారణకు చేసిందా లేదా ‘సిటాడెల్’ కోసం చేసిందా అనేది తెలియదు. ఇదే షేర్ లో సామ్ ‘యాక్షన్ మోడ్ ఆన్’ అంటూ రెండు బాంబ్ ఎమోజీలను కూడా జత చేసింది. దీనితో ఇది ఖచ్చితంగా చైతూని టార్గెట్ చేసిందని చైతూ ఫ్యాన్స్ అంటున్నారు. మరి సామ్ ఎవరికి పంచులు ఇవ్వబోతోందో చూడాల్సిందే.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.