Salt: మన హిందువులు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఉప్పును ప్రత్యేకంగా పూజించడమే కాకుండా సంధ్యా సమయంలోను కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇతరులకు దానం ఇవ్వకూడదని కూడా భావిస్తుంటారు. ఎవరికైనా ఉప్పు ఇవ్వాలని సరాసరి చేతిలోకి పెట్టకూడదని కూడా పెద్దలు చెబుతుంటారు. అలా ఇవ్వటం వల్ల అప్పుల పాలవుతారని చెబుతుంటారు. మరి నిజంగానే ఉప్పుని చేతికి ఇవ్వకూడదా ఇస్తే ఏం జరుగుతుంది దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్రగర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తూ ఉంటాము.ఇక మనకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే కూడా ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఉప్పుతో ఎన్నో పరిహారాలను చెబుతూ ఉంటారు ఇలా ఉప్పుతో పరాహారాలు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
Salt:
ఉప్పుతో పరిహారం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది జ్యేష్టాదేవిని వదిలించుకోవాలని అర్థం. ఇలా
జ్యేష్టాదేవిని వదిలించుకోవడానికి ఉప్పుతో పరిహారం చేస్తారు కనుక ఉప్పుని చేతికి ఇవ్వకూడదని చెబుతారు. ఇలా ఇవ్వటం వల్ల తీసుకున్నవారికి మంచి జరిగినా ఇచ్చిన వారికి దరిద్రం వెంటాడుతుందని అందుకే ఉప్పు ని ఎప్పుడు కూడా చేతితో ఇతరులకు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.