Wed. Jan 21st, 2026

    Salaar Twitter Review: అనుకున్నదే జరిగింది. ప్రభాస్ కెరీర్ లో ‘సలార్ సీజ్ ఫైర్’ సంచలనం సృష్ఠించబోతుంది. ఈ సినిమాకి తాజాగా ట్విట్టర్ వచ్చింది. ఏకంగా ప్రముఖ రివ్యూ రైటర్ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లో స్టార్ డం సాధించుకున్న ప్రభాస్ ఆ తర్వాత నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో తీవ్రంగా నిరాశపరచారు.

    దాంతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్’ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఉగ్రమ్’, ‘కేజీఎఫ్’ సీక్వెల్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ కి చేరుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశానికి తాకాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా ‘సలార్’ ఉందని ఉమైర్ సంధు తన పోస్ట్ లో తెలిపారు. అంతేకాదు, ఏకంగా నాలుగు స్టార్స్ ఇచ్చారు.

    salaar-twitter-review- The Twitter review of 'Salar' is overwhelming.. Four stars together (****).
    salaar-twitter-review- The Twitter review of ‘Salar’ is overwhelming.. Four stars together (****).

    Salaar Twitter Review: ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ‘సలార్’ సినిమాకి హైలెట్

    ముఖ్యంగా ఈ సినిమాలో ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ కి థియేటర్స్ లో రచ్చ మామూలుగా ఉండదట. అలాగే, ఇంటర్వెల్ ఫైట్ చూస్తే ఒక్కొక్కరికీ మైండ్ బ్లాకేనని అంటున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ‘సలార్’ సినిమాకి హైలెట్ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అభిమానుల అంచనాలను ‘సలార్’ అందుకుందని..బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఊచకోత ఖాయమని, సరికొత్త రికార్డులు సృష్ఠిస్తారని న్యూస్ ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.

    కాగా, ఇండియాలో అర్థరాత్రి 1 గంట నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజే ఊహకందని వసూళ్ళు రాబట్టవచ్చునని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సలార్’ కథ ఇద్దరు ప్రాణ స్నేహితులదనీ ..ఆ తర్వాత వారిద్దరూ బద్ద శతృవులుగా మారతారని, దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. అందుకే, రెండు భాగాలుగా ప్లాన్ చేసి ఈ సినిమా మొదటి భాగం ప్రీ క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు. అందుకే, ఇప్పుడు ‘సలార్’ సినిమా రెండో భాగం మీద అసాధారణమైన అంచనాలు పేరగడం ఖాయమని పోస్టులో పేర్కొన్నారు.

    https://twitter.com/Nani____4/status/1737903260814676187

    https://twitter.com/BeingUk7/status/1737900617589490096

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.