Tue. Jan 20th, 2026

    Sai Pallavi : మన దగ్గర కూడా టాక్స్ షోస్‌కి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జయప్రదం, లక్ష్మీ టాక్ షో, సౌందర్య లహరి లాంటి షోస్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రానాతో నంబర్ 1 యారీ అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోస్, మీలో ఎవరు కోటీశ్వరులు, కొంచం టచ్‌లో ఉంటే చెబుతా, ఇప్పుడు అన్‌స్టాపబుల్. ఇవన్నీ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నవే.

    ఈ క్రమంలోనే సోనీ లివ్ వారు మరో సరికొత్త టాక్ షోను మొదలుపెట్టారు. దీనికి పాపులర్ పాప్ సింగర్ స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే, ఈ షోకి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, సాయి పల్లవి లాంటి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ వచ్చి ప్రోగ్రాం లో అన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే, ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా విచ్చేశారు.

    sai-pallavi-It would be good if those three dance with me at the same time..
    sai-pallavi-It would be good if those three dance with me at the same time..

    Sai Pallavi : ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

    ఇందులో ఆమె తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ విషయంలో చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు అంతటా బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్..ఈ ముగ్గురిలో మీకు ఎవరితో డాన్స్ చేయాలని ఉంది..? అనే ప్రశ్నకి సూపర్ ఆన్సర్ ఇచ్చి..ఆ ముగ్గురు హీరోల అభిమానులకి కిక్కిచ్చింది.

    ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్..ఈ ముగ్గురూ కలిసి నాతో డాన్స్ చేస్తే బావుంటుంది..అంటూ పెద్దగా నవ్వేసింది. ఇప్పుడు సాయి పల్లవి చెప్పిన ఈ మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలతో వచ్చి ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, ఆమెకి మాత్రం పర్ఫార్‌మెన్స్ పరంగా ఈ మూడు చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.