Sai Pallavi : ఫిదా సినిమాతో హైబ్రిడ్ పిల్లగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది మలయాళీ బ్యూటీ సాయి పల్లవి. ఇక్కడ అమ్మాయి కాకపోయినా తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని ఫిదా చేసింది. తన డాన్స్ మూవ్స్ తో ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తుంది. మొదటి సినిమా తోనే మైండ్ బ్లాక్ చేసిన సాయి పల్లవికి వరుస ఆఫర్లు వచ్చాయి. సహజ సిద్ధమైన లుక్స్ తో కనిపిస్తూ సహజ నటిగా పేరు సంపాదించుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్డమ్ ను సంపాదించుకుంది. గారికి విరాటపర్వం వంటి సినిమాల్లోనూ వితౌట్ మేకప్ నటించి తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది.
ఇప్పటివరకు చాలా వరకు టీవీ షోలో తన లైఫ్ జర్నీకి సంబంధించి అనేక విషయాలను పంచుకుంది సాయి పల్లవి. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం నటి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే మీటూ విషయానికి సంబంధించి స్పందించింది సాయి పల్లవి. ఏదో టచ్ చేస్తాను లేదా అసభ్యకరంగా బిహేవ్ చేస్తేనో కాదు మాటలతో కూడా ఏ మాత్రం ఇబ్బంది కలిగించేలా చేసినా కూడా అది వేధింపులతో సమానమేనని సాయి పల్లవి తెలిపింది. సింగర్ స్మిత ఈమధ్య చేస్తున్న నిజం విత్ స్మిత అనే ప్రోగ్రాం కి సాయి పల్లవి గెస్ట్ గా వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మీ టూ ఉద్యమానికి సంబంధించి చేసిన కామెంట్స్ సంబంధించిన ప్రోమో కట్ అయింది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కేవలం మీతో మాత్రమే కాకుండా సాయి పల్లవి తన కెరీర్లో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను స్మితతో తెలిపింది. తాను ఎదిగే క్రమంలో వచ్చిన అనేక సవాళ్లను ఎలా అధిగమించిందో తెలిపింది. యాంకర్ స్మిత మరో చమత్కారమైన క్వశ్చన్ అడిగింది దానికి అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చింది సాయి పల్లవి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేయాలనీ ఉంది అని అడిగితే ఈ ముగ్గురూ కలిసి తనతో ఓ పాట చేస్తే బాగుంటుందని చెప్పింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.