Categories: DevotionalLatestNews

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24: శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం నుండీ భక్తకోటి ఉపాసించుకుని తరించేందుకు శ్రీ అమృతేశ్వర దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజనీ కొర్రపాటి దంపతులు ‘సహస్ర’ పేరిట సుమారు రెండువందల యాభైపేజీల చక్కని పవిత్ర తెలుగు భక్తి గ్రంధాన్ని ఉచితంగా పంచడం పలువురు రాజకీయ సామాజిక భక్త ప్రముఖుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప వ్యాఖ్యానాలతో, ఋషుల స్తోత్ర విద్యలతో ‘సహస్ర’ పేరిట ధార్మిక జీవన ప్రార్ధనా గ్రంధంగా సాయి కొర్రపాటి సమర్పణలో అందిన ఈ గ్రంధం ప్రస్తుతం బళ్లారిలో వందలకొలది గృహాలలో పారాయణాగ్రంధంగా మారినట్లు భక్తకోటి శ్రీ అమృతేశ్వరదేవస్థానంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

శ్రీ అమృతేశ్వరుని స్వరూపంగా స్పటిక మహాలింగంతో గత సంవత్సరం ప్రతిష్ఠితమైన ఈ అద్భుతమైన ఆలయ వైభవ రూప దర్శనానికి విచ్చేసే భక్తులు అభిషేకం అనంతరం గత కొంత కాలంగా ఈ విశేష శక్తుల సహస్ర గ్రంధాన్ని మహా ప్రసాదంగా తీసుకెళ్తున్నట్లు మన కనులముందు కనిపించే సత్యం.

sai-korrapati-korrapati-offered-the-legendary-sahasra-beauty-to-amriteshwara

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం వర్షించే అమృత రసధారల్లాంటి అమోఘ గ్రంధాలకు బెంగళూరు, బళ్లారి వంటి ప్రాంతాలలో తెలుగు వారు ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు.

దర్శకధీరుడు, RRR ఫేమ్ ఎస్ ఎస్ రాజమౌళి, కేజీఎఫ్ హీరో యశ్, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎమ్ ఎమ్ కీరవాణి, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వంటి ప్రముఖులెందరో శ్రీ అమృతేశ్వరస్వామి ఆలయ ప్రారంభ వేడుకలో పాల్గొన్న అంశం ఇప్పటికీ బళ్లారి ప్రజలు చెప్పుకుంటూంటారు.

వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి శివ భక్తుడు కావడం వల్ల బళ్లారికి ఈ అద్భుతం లభించిందని బళ్లారి కమ్మసంఘం ప్రముఖులు సైతం వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు.

చాలా ఆలయాల్లో దైవ గ్రంధాలు అమ్ముతున్న ఈరోజుల్లో భక్త కోటికి ఇంత మంచి సహస్ర గ్రంధాన్ని శ్రీ అమృతేస్వరుని కటాక్షంగా ఉచితంగా ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.

వేద పండితులు, అర్చకులు మాత్రమే కాకుండా భక్తులు సైతం హాయిగా చదువుకునే అనేక స్తోత్రాలు, అందమైన వ్యాఖ్యానాలు ఈ బుక్ నిండా ఉండటం వల్ల బళ్ళారి తెలుగు భక్తుల్ని ఈ సహస్ర గ్రంధం విశేషంగా ఆకట్టుకోవడం గమనార్హం.

గతంలో సాయికొర్రపాటి సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ దేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయస్వామి అరుదైన చిత్రాలతో, యంత్ర మంత్ర తంత్రాత్మకంగా అద్భుత రచనా సంకలనంగా పరమ శోభాయమానంగా రూపుదిద్దిన అఖండ భారీగ్రంధం ‘నేనున్నాను’ని రెండేళ్లనాడు భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి.. ప్రచురణకర్త సాయి కొర్రపాటిని, గ్రంథ రచయిత పురాణపండ శ్రీనివాస్ లపై అభినందనలు వర్షించిన విషయం పాఠకులకు ఎరుకే!

ప్రమాణాలు పాటించడంలో రాజీపడని మనస్తత్వంతో అద్భుత గ్రంధాలు రచించి వేల వేల అభిమానుల్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, సాయి కొర్రపాటికి అత్యంత ఆప్తుడని కొర్రపాటి సాయి సన్నిహితులు చెబుతున్నారు. సినీరంగంలో కొర్రపాటి సాయికి రాజమౌళి చాలా ఆంతరంగిక ఆత్మ బంధువని కన్నడ తెలుగు రంగాలకు తెలుసున్న విషయమే. ఈ క్రమంలో కొర్రపాటి పవిత్ర కార్యక్రమాలకు ఆప్తుడు పురాణపండ శ్రీనివాసేనని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.