Sai Dharam Tej: నెటిజన్ అడగగానే 10 లక్షలు ఇచ్చేశాడు..అదీ మెగా హీరో అంటే..అని ఓ తాజా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మంచి స్టార్ డం సంపాదించుకుంటున్నారు. అభిమానులను మెప్పించడం కోసం డాన్సుల్లో, ఫైట్స్ లో, యాక్టింగ్‌లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు. కమర్షియల్ హీరోగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో అయినా మొదటి సినిమాకే చిరంజీవి పేరు వాడుకుంటున్నారు. రెండవ సినిమా నుంచి మాత్రం సొంతగా కష్టపడుతూ తమకంటూ బాక్సాఫిస్ వద్ద ఓ మార్కెట్ ని ఏర్పరుచుకుంటున్నారు. చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి పరిచయమైన నాగ బాబు నటుడిగా, నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్..ఏకంగా పవర్ స్టార్ ఇమేజ్ ని సాధించారు. ఆయన సినిమా రిలీజ్ అంటే బిజినెస్ అన్న సినిమా కంటే ఎక్కువగా అవుతుంది.
ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్..ఇలా ప్రతీ ఒక్కరూ ఓ స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. మెగా మల్టీస్టారర్స్ కూడా టాలీవుడ్‌లో బాగా వస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో..మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంటారు.
అలాగే, తాజాగా సాయి ధరమ్ తేజ్ నెటిజన్స్‌తో చాట్ చేశాడు. వారిలో ఒకరు చిరంజీవితో కలిసి ఎప్పుడు నటిస్తారు అని అడిగారు. ఆ ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్నా..అంటూ సమాధానమిచ్చాడు. ఇంకొకరు రామ్ చరణ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారు..అని అడిగాడు. దానికి వెంటనే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నేను చరణ్ కలిసి నటిస్తామని సమాధానమిచ్చాడు.
ఈ క్రమంలో ఇంకో నెటిజన్..బ్రో.. ఒక 10 లక్షలుంటే పంపించు..అని అడిగాడు. దానికి సాయి ధరమ్ తేజ్ సీరియస్ అవకుండా బ్రహ్మానందం ఉన్న ఒక ఫన్నీ ఏమోజీనీ పంపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కన్వర్‌జేషన్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది. దాంతో ఇప్పుడు ఒత్తిడి సాయి ధరమ్ తేజ్ మీద పడింది. ఈసారి మెగా ఫ్యామిలీలో జరగబోయే పెళ్ళి ఈ మెగా మేనల్లుడిదే.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.