Virupaksha : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది భారీ యాక్సిడెంట్ అయి పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైలాగులు చెప్పలేక చాలా ఇబ్బందులు పడ్డాడు సాయి తేజ్. అయినా మెగా హీరోలకి పట్టుదల ఎక్కువ. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకూ నిద్రపోరు. ఈ మెగా మేనల్లుడు కూడా అంతే.
విరూపాక్ష సినిమా కోసం చాలా శ్రమించాడు. దీనికి కారణం ఇది ఒకరకంగా సాయి తేజ్ కి పునర్జన్మ కావడమే. ఇంకోటి కథ. ఇలాంటి కథను గతంలో ఈ మెగా హీరో టచ్ చేయలేదు. అన్నీ రకాలుగా ఈ సినిమా సాయి తేజ్ కి పెద్ద ఛాలెంజ్. అందుకే పెద్ద రిస్క్ చేసి ఫైనల్‌గా సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద విడుదలైన సమయం నుంచి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులందరూ సూపర్ హిట్ అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కావడంతో ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేవనివ్వకుండా సినిమా చివరి థ్రిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విరూపాక్ష సినిమాపై అంతగా అంచనాలు లేవనే చెప్పాలి. కానీ, వారి ఆలోచనను తలకిందులు చేస్తూ ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక విరూపాక్ష సక్సెస్ క్రెడిట్ కొంత దర్శకుడు సుకుమార్ ఖాతాలోకి వెళుతుంది. అలాగే లక్కీ హీరోయిన్ అని చెప్పుకుంటున్న సంయుక్త మేనన్ కి దక్కింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో తనేంటో నిరూపించుకొని బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.