RRR: తెలుగు సినిమా చరిత్రలో గర్వంగా చెప్పుకునే రోజు రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సాంగ్ కి ఇప్పటికే అందరూ పట్టం కట్టారు గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ సాంగ్ ఇప్పుడు ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకోవడం సంచలనం అని చెప్పాలి. ఇక ఆస్కార్ వేడుక ప్రారంభం నుంచి నాటు నాటు పాట సందడి ఆడిటోరియంలో కనిపించింది. సింగర్ రాహుల్, కాల భైరవ లైవ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు. ఇక దీపికా పదుకునే ఈ సాంగ్ ని పరిచయం చేయడం కూడా చాలా గొప్పగా చేసింది.
తరువాత లైవ్ పెర్ఫార్మెన్స్ ని హాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మెచ్చుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరీలో అవార్డుని ప్రకటించగానే తారక్, రామ్ చరణ్ ఒక్కసారి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రతి మూమెంట్ కి ఆస్కార్ వేడుకలలో ఆశ్వాదించారు. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డుని ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను నాటు నాటు గెలుచుకోవడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది.
ఇదిలా ఉంటే ఇక ఈ అవార్డు రావడంపై రామ్ చరణ్, తారక్, రాజమౌళి, ఎంఎం కీరవాణి అందరూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక ట్విట్టర్ లో సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కి విషెస్ చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ సాంగ్ ఇండియా నుంచి అవార్డు అందుకున్న మొట్ట మొదటి ఫీచర్ ఫిల్మ్ గా ఇప్పుడు నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ పాటకి ఆస్కార్ అవార్డ్ దక్కిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతీ సినీ తారలు, దర్శకనిర్మాతలు, ఇండస్ట్రీ వర్గాలు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదీ తెలుగోడి సత్తా అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.