Roja Selvamani: అయ్యో పాపం.. బాబు భయపడే రోజాను అరెస్ట్ చేయలేదా..?

Roja Selvamani: వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా సోషల్ మీడియాను, టీవీ స్క్రీన్లను ఊపేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా గొంతు మళ్లీ లేచింది. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో ఏకంగా 45 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాక.. దాదాపు సైలెంట్ అయిపోయిన రోజా, తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో మళ్లీ తన పాత వాడిని ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా.. తనను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

రోజా లాజిక్ ప్రకారం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఆమెపై ఉన్న భయమేనట. గతంలో (2014-19 మధ్య) తనను అసెంబ్లీ నుంచి అకారణంగా సస్పెండ్ చేసి ఏడిపించినందుకు చంద్రబాబుకు అధికారం పోయిందని, ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. మహిళల జోలికి వస్తే శాపాలు తగులుతాయన్న భయంతోనే చంద్రబాబు తన జోలికి రావడం లేదని ఆమె సెలవిచ్చారు. అయితే, రాజకీయాల్లో కేసులు, అరెస్టులు అనేవి చట్ట పరిధిలో జరుగుతాయా లేక ఇలాంటి సెంటిమెంట్ల ఆధారంగా జరుగుతాయా అన్నది నెటిజన్లకు మింగుడుపడని ప్రశ్నగా మారింది.

roja-selvamani-sensational-commensts-on-chandrababu

Roja Selvamani: ఓటమి తట్టుకోలేక రెండు నెలల పాటు చెన్నైలో రిలాక్స్ అయిన రోజా!

ఇక తన మంత్రిత్వ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే తన ఫైళ్లన్నీ దులిపేసి ఉంటారని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే తనను టచ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే.. తాము ఓడిపోవడానికి ప్రజలు కారణం కాదట, కేవలం ఈవీఎంల మహిమ వల్లే వై నాట్ 175 కాస్తా కేవలం 11 సీట్లకు పడిపోయిందని రోజా గట్టిగా నమ్ముతున్నారు. ఇంతటి భారీ ఓటమి తర్వాత కూడా ప్రజలు తమ వైపే ఉన్నారని క్లెయిమ్ చేయడం చూసి సొంత పార్టీ క్యాడరే ముక్కున వేలేసుకుంటోంది. ఓటమి తట్టుకోలేక రెండు నెలల పాటు చెన్నైలో రిలాక్స్ అయిన రోజా.. ఇప్పుడు మళ్లీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ మైకుల ముందుకు రావడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

3 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

This website uses cookies.