ప్రముఖ ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి అన్షుమాలిని కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం డిగ్రీ పట్టా పుచ్చుకోవడమే కాకుండా, ‘హైయెస్ట్ డిస్టింక్షన్’తో ఉత్తీర్ణురాలై తన మేధస్సును చాటుకున్నారు. అయితే అసలు సిసలైన విజయం మరొకటి ఉంది. ఈ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా భావించే ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డు’ను అన్షు దక్కించుకున్నారు. విశేషమేమిటంటే, ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు రికార్డు సృష్టించడం విశేషం.
Roja Selvamani: రోజా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తన కుమార్తె అవార్డులు అందుకుంటుంటే చూసి రోజా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం ఒక అవార్డుతోనే ఆగకుండా.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు, అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ లీడర్, లడ్డి అకడమిక్ ఎక్సలెన్స్ వంటి ఎన్నో పురస్కారాలను అన్షు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాల పరంపరను చూసి రోజా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. “ఒక తల్లికి తన బిడ్డ కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే మించిన కానుక ఏముంటుంది?” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
మదర్స్ డే వేళ మర్చిపోలేని గిఫ్ట్!
యాదృచ్ఛికంగా ఈ గ్రాడ్యుయేషన్ వేడుక మదర్స్ డే సమయంలోనే జరగడంతో రోజా మరింత ఉద్వేగానికి గురయ్యారు. “నా జీవితంలో ఈ మదర్స్ డేని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చావు.. నీ ప్రయాణం నాకు గర్వకారణం” అంటూ అన్షును పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం అన్షుమాలిని అమెరికాలో సాధించిన ఈ అరుదైన గౌరవంపై నెటిజన్లు, సినీ రాజకీయ ప్రముఖులు రోజా కూతురికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజంగానే ఒక స్టార్ కిడ్ అంటే కేవలం గ్లామర్ వెనుక వెళ్లకుండా, చదువులోనూ దేశం గర్వించేలా రాణించవచ్చని అన్షు నిరూపించారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.