Prabhas-Spirit: ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో స్పిరిట్ ఒకటి. తాజాగా, ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలే, ప్రభాస్ చేసే సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో..అర్థం కాని పరిస్థితి. అలాంటిది, ఇప్పుడు వచ్చిన ఈ వార్త చూసి అభిమానులు డైలమాలో పడ్డారట. మరి, స్పిరిట్ మూవీ గురించి అంతగా వైరల్ అవుతున్న ఆ వార్త ఏంటో డీటైల్స్ లో కి వెళ్ళి చూద్దాం..
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్..ఈ మూడు సినిమాలతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ స్టామినా ఏంటో అర్థమైంది. శివ సినిమాతో రాంగోపాల్ వర్మ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడో, అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్‌లో అంతకంటే గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. ఒకే ఒక్క షాట్‌లో హీరో ఎలివేషన్ అనేది ఇప్పటి వరకూ ఏ దర్శకుడూ చూపించనిది. ముందే, బ్యాగ్రౌండ్ స్కోర్ రెడీ చేసుకొని సినిమా చేయడం అనేది కొత్త ఆలోచన.
Prabhas-Spirit: ప్రభాస్-వివేక్ ఓబెరాయ్ లపై రెండు నెలలపాటు ఫైట్ సీక్వెన్స్!
ఇలాంటి, చాలా మార్పులు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడున్న, రాబోతున్న ఫిల్మ్ మేకర్స్‌కి చూపించాడు. అయితే, ఈయన కూడా ఒక్కో సినిమా కంప్లీట్ చేయడానికి చాలా నెలలు సమయం తీసుకుంటాడనే మాట ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోందట. స్పిరిట్ సినిమా టాకీ పార్ట్ ఎంతవరకూ వచ్చిందో క్లారిటీ లేదు. అయితే, ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారట. ఈ షెడ్యూల్ లో కేవలం యాక్షన్ పార్ట్ మాత్రమే షూట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు, ప్రభాస్-వివేక్ ఓబెరాయ్ లపై రెండు నెలలపాటు ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారని తాజా సమాచారం. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే రెండు నెలల సమయం అంటే ఇది చాలా ఎక్కువ సమయం అనే మాట వినిపిస్తోంది. దీనితో, షూటింగ్ మొత్తం పూర్తవుతుందా..లేక ఇంకా చేయాల్సిన టాకీ పార్ట్ ఉంటుందా..! అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో, ప్రభాస్ సరసన అనిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తోంది. వాస్తవానికి, ఇందులో దీపిక పడుకొణ్ నటించాల్సి ఉండగా..క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె తప్పుకున్న సంగతి తెలిసిందే.
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…
This website uses cookies.