Rice: సాధారణంగా ప్రతి ఒక్కరూ బియ్యం కొనుగోలు చేసేటప్పుడు ఏడాదికి సరిపడా బియ్యం ఒక్కసారి కొనుగోలు చేస్తుంటారు. మరి కొందరు నెలకు ఒకసారి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఏడాదికి ఒకేసారి బియ్యం కొనుగోలు చేసేవారు ఇంట్లో ఎక్కువ కాలం పాటు బియ్యం నిల్వ ఉండటం వల్ల కొన్ని సార్లు బియ్యం పురుగు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి.ఇలా బియ్యం మొత్తం పురుగు పట్టడం వల్ల మనం అన్నం చేసిన ప్రతిసారి బియ్యం శుభ్రం చేసుకోవడం జరుగుతుంది అలాగే అన్నం కూడా పెద్దగా రుచికరంగా ఉండదు.
ఇలా బియ్యంలో కనుక తరచూ పురుగులు కనపడుతూ ఉంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు బియ్యంలో పురుగు లేకుండా పోవడమే కాకుండా బియ్యం కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం… .సాధారణంగా బియ్యం ఎండలో ఆరబోస్తే పురుగులు పట్టవని చెబుతుంటారు. అయితే పల్లెటూరులో ఉన్నవారు ఈ విధంగా ఎండలో వేస్తారు కానీ పట్టణాలలో ఉన్నవారికి ఇది కుదరదు కనుక బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలి అంటే మనం వంటలలో ఉపయోగించే ఇంగువను చిన్న బట్టలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం డబ్బాలో వేయాలి.
Rice:
ఈ విధంగా ఇంగువ వేయడం వల్ల ఇంగువ నుంచి వచ్చే ఘటైన వాసనకు బియ్యంలో పురుగులు అసలు పడవు. ఇక బియ్యంలో పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వేపాక రెబ్బలను ఎండబెట్టి పొడి చేసే వాటిని ఒక గుడ్డలో కట్టి బియ్యపు డబ్బాలో వేయటం వల్ల బియ్యం పురుగు పట్టదు.ఇలా ఈ పద్ధతులు కనుక పాటిస్తే బియ్యం పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటాయి.