Rice: సాధారణంగా మనం ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా రైస్ తప్పనిసరిగా తీసుకుంటాము అయితే ఈ రైస్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు కొందరు అన్నం వంచకుండా అలాగే చేస్తారు మరి కొందరు కట్టెలు పోయి పైన చేయగా మరికొందరు ఎలక్ట్రిక్ స్టవ్ గ్యాస్ స్టవ్ వంటి వాటి ద్వారా మనం రైస్ తయారు చేసుకుంటూ ఉంటాము కానీ మనం చేసే ఈ రైస్ విషయంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటాము మరి మనం చేసే ఆ తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే…
అన్నం చేసేటప్పుడు చాలామంది బియ్యం సరిగా కడగరు. ఇలా కడగకపోవడం వల్ల అన్నం జిగటగా మారుతుంది అంతేకాకుండా వరిలో పురుగు పట్టకుండా చాలా రసాయనాలు వేస్తూ ఉంటాము రసాయనాలను బియ్యం సరిగా కడకపోవడం వల్ల మనం తీసుకున్నట్లే అవుతుంది. అందుకే తప్పనిసరిగా బియ్యం రెండు మూడు సార్లు కడగటం ఎంతో మంచిది. ఇక చాలామంది వంట చేసేటప్పుడు గ్యాస్ ఎక్కువగా పెట్టి చేయడం వల్ల తొందరగా అవుతుందని భావిస్తారు కానీ అలా చేయటం వల్ల అన్నం సరిగా కాదని అంతేకాకుండా అందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే తక్కువ మంటపైన అన్నం చేసుకోవడం మంచిది.
ఇక అన్నం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా స్టౌ పైన అయినా ఆఫ్ చేసిన వెంటనే తినకూడదు అలా తినడం మంచిది కాదు కాసేపు ఆగిన తర్వాతనే భోజనం చేయడం చాలా మంచిది. ఇక బ్రౌన్ రైస్ వైట్ రైస్ చేసే వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వైట్ రైస్ మాదిరిగా బ్రౌన్ రైస్ తక్కువ సమయానికే తయారు కాదు అంతే కాకుండా బ్రౌన్ రైస్ కి కాస్త ఎక్కువ మొత్తంలో నీటిని వేయాలి ఇలా వేసినప్పుడే బ్రౌన్ రైస్ కూడా చాలా మంచిగా తయారవుతుంది. ఇక బియ్యానికి సరిపడా నీళ్లు కాకుండా రెండు రెట్లు అధికంగా వేయాలి అలా వేసినప్పుడే మనం తయారుచేసే రైస్ చాలా పొడిపొడిగా వస్తుంది లేదంటే ముద్ద ముద్దగా మారిపోయి తినడానికి రుచిగా అనిపించదు.