RGV-Sreelakshmi Satheesh : ఆర్జీవీ మనసుపడ్డ పిల్ల వయసు ఎంతో తెలుసా?

RGV-Sreelakshmi Satheesh : శ్రీ లక్ష్మీ సతీష్ ఈ పేరు ఇప్పుడు నెట్టింట్లో జోరుగా వినిపిస్తోంది. కుర్రాళ్లంతా ఈమె పేరే జపిస్తున్నారు. ఆమె అందానికి దాసోహం అవుతున్నారు. ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్‎లో పోస్ట్ రీల్స్ అందరినీ అమితంగా ఆకట్టుకుంటాయి. పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పొట్టి బట్టల్లో ఎప్పుడూ కనిపించదు. అందాల ప్రదర్శన అస్సలు చేయదు. పూర్తిగా సంప్రదాయ బద్దంగా చీరకట్టులో కనిపిస్తూ అందరినీ కవ్విస్తుంది. చీర కట్టులోనే అసలైన అందాలను, ఇంకా అందంగా చూపించొచ్చు అని ఈ అమ్మడిని చూసే చెప్పవచ్చు. ఈ కేరళ కుట్టికి ఫిదా కాని వారంటూ ఎవరూ లేరేమో. ఆమె కురులు, కళ్లకు అందరూ ఫ్యాన్సే . అందుకే నెటిజన్లు ఆమె అందాలకు పడిపోతోన్నారు. ఇన్ స్టాలోనూ ఈమె ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.

rgv-sreelakshmi-satheesh-ram-gopal-varma-crush-kerala-girl-sreelakshmi-satheesh-2

నెటిజన్స్ మాత్రమే కాదు ప్రముఖ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ ఆ అమ్మాయి అందంపై మనసు పారేసుకున్నారు. అందుకే ఆమె అందాన్ని అందరికీ పరిచయం చేయాలనో ఏమో శ్రీ లక్ష్మీ చేసిన ఓ రీల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. దీంతో ఒక్కసారిగా అమ్మడి ఫాలోవర్లు సైతం పెరుగుతున్నారు. గత రెండు మూడు రోజుల్లోనే 30వేలకు పైగా ఫాలోవర్లు ఈమె ఖాతాలో చేరారు. దీంతో లేటెస్టుగా శ్రీ లక్ష్మీ సతీష్ అనే పేరు నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేస్తోంది. చీరకట్టులోని అందాన్ని ఆమె ద్వారానే ఇప్పుడే తెలుసుకున్నా.. ఈమెతో చీర మీద ఒక మూవీ చేస్తాను. వర్మ పోస్ట్ చేయడంతో శ్రీ లక్ష్మీ సతీష్ మరింతగా వైరల్ అయింది.

rgv-sreelakshmi-satheesh-ram-gopal-varma-crush-kerala-girl-sreelakshmi-satheesh-2

తాజాగా శ్రీ లక్ష్మీ తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ” నా వయసు 22. నా ఎత్తు 5’8 . ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివాను, సెప్టెంబర్ 28న నా పుట్టినరోజు. వర్మ నా గురించి సర్చ్ చేస్తున్నాడని, ఫోటోగ్రాఫర్ చెప్పాడు. అంతలోనే నాకు ఇన్ స్టాలో నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. ఏం జరుగుతోందని ఆలోచించా. ఆ తర్వాత వర్మ కాంటాక్ట్ అయ్యారు. చీర సినిమా చేద్దామని చెప్పారు. స్టోరీ మాత్రం ఇంకా చెప్పలేదు. కథ చెప్పిన తర్వాత అంతా ఓకే అవుతుంది. వర్మ తీసిన రంగీలా మూవీ అంటే నాకు చాలా ఇష్టం ” అంటూ తన గురించి చెప్పుకొచ్చింది. డైరెక్టర్ ఆర్జీవీ నీ వీడియోను షేర్ చేశారు కదా ఎలా ఉంది? నీ లైఫ్ ఏమైనా మారిందా? అని ఓ నెటిజన్ అడిగాడు…ఎప్పటిలాగే ఉందని సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. దీనిని బట్టి చూస్తే వర్మ వల్ల తనకేమీ కొత్తగా ఫేమ్ రాలేదన్నట్టుగా ఆమె చాలా సెటైరిక్ గా మాట్లాడిందని అర్థం అవుతోంది. అయితే ఆర్జీవీ ఈమె వీడియో షేర్ చేసిన తరువాతే ఈ రేంజ్ ఫాలోయింగ్ పెరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.