Wed. Jan 21st, 2026

    Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి పీసీసీ చీఫ్ పదవిని రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకొని సొంతం చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో ఉన్నారు. ఆ దిశగా వెళ్ళడానికి పాదయాత్ర కోసం మొదలు పెట్టారు. అయితే తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వర్గ పోరు. ఒక్కో నాయకుడికి ఒక్కో వర్గం ఉంటుంది. ప్రతి ఒక్కరు తమకు తాము ముఖ్యమంత్రి అభ్యర్ధులుగానే అనుకుంటారు.

    Revanth seeks ORR contract details under RTI from TS govt

    నేరుగా ప్రకటించేసుకుంటారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బట్టీ విక్రమార్క, జానారెడ్డి ఇలా పదుల సంఖ్యలో నాయకులు అందరూ కూడా మేమే నెక్స్ట్ ముఖ్యమంత్రి అంటూ చెప్పుకుంటారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన ఉండదు. గతంలో రాజశేఖర్ రెడ్డి చరిష్మా కారణంగా మిగిలిన నాయకులలో చాలా మంది సైలెంట్ గా ఉండేవారు. అయితే ఆయన మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విచ్చిన్నం అయ్యింది. ఆరంభంలో తెలంగాణలో కొంత బలం చూపించిన బలమైన నాయకత్వం లేకపోవడం వలన క్యాడర్ అంతా కూడా బీజేపే వైపు వెళ్ళిపోతూ వచ్చారు.

    Telangana Congress chief Revanth Reddy to join 'Haath se Haath jodo'  padyatra - India Today

    నాయకులు కూడా బీజేపీ గూటికి వలస పోయారు. ఇక రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించిన తర్వాత అయిన గాడిలో పడుతుందా అంటే అది లేదు. రేవంత్ రెడ్డితో ఎవరికి పొసగడం లేదు. అతని నాయకత్వాన్ని కూడా కొంతమంది ఒప్పుకోవడం లేదు. అయితే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తోన్న రేవంత్ రెడ్డి మాత్రం అందరిని కలుపుకొని వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణలో కూడా రావాలని అనుకుంటున్నారు. అయితే ఆయన కలలకి కాంగ్రెస్ నేతలు పెద్ద అడ్డంకిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.