Renuka Chowdhury: తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాజకీయ నాయకురాలు రేణుక చౌదరి. ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేణుక చౌదరి కాంగ్రెస్ లో సీనియర్ పొలిటిషన్ గా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి హయంలో రేణుక చౌదరి హవా బాగా నడిచింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రేణుక చౌదరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఆమె మద్దతు ఇచ్చారు.
అదే సమయంలో అమరావతి రాజధాని కూడా సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఆమె చాలా అనుబంధం కలిగి ఉన్నారు. చౌదరి కావడంతో తెలుగుదేశం పార్టీ పైన కూడా అభిమానం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తనని గుడివాడ నుంచి పోటీ చేయమని కూడా కొంతమంది అభిమానులు కోరుతున్నారని చెప్పుకొచ్చారు. గుడివాడలో వైసిపి ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. అయితే ఒకప్పుడు ఆస్థానం తెలుగుదేశం పార్టీ కంచుకోట అనే సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. అయితే అమరావతి ఇష్యూ నేపథ్యంలో కొడాలి నాని, రేణుక చౌదరిపై గతంలో సంచలనం వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె కూడా కౌంటర్ ఇచ్చారు.
ఇదేలా ఉంటే తాజాగా ఆమె గుడివాడ నుంచి పోటీ చేసే ఉద్దేశం కూడా ఉందని అభిప్రాయాన్ని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే గతంలో ఆమె తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఏపీ వైపు ఆమె దృష్టి మళ్లించిందా అనే మాట రాజకీ వర్గాలలో వినిపిస్తుంది. అయితే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు కనీసం ఓటు బ్యాంకు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఉన్న ఆమె ముందున్న ఆప్షన్ తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడమే అనే మాట కూడా వినిపిస్తుంది. రేణుక చౌదరి పార్టీలో చేరుతానంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.