Wed. Jan 21st, 2026

    Renu Desai:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల వ్యవహారం కొంత విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి తమ అభిమాన హీరో మాటలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. లక్షలాదిమంది అభిమానులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలవక పోవడానికి వారు కూడా ఒక కారణం అనే విమర్శలు ఉన్నాయి. ఎక్కువగా యువత పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తూ ఉంటారు. అయితే వారికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదని విమర్శలు ఉన్నాయి. ఇతర హీరోల సినిమా ఫంక్షన్స్ లో కూడా పవర్ స్టార్ అభిమానులు అల్లరి చేస్తూ వారి ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. గతంలో నాగబాబు సైతం పవన్ కళ్యాణ్ అభిమానులపై ఓ ఈవెంట్ లో సీరియస్ అయ్యారు.

    Renu Desai and Akira Nandan test positive for COVID-19

    అలాగే అల్లు అర్జున్ కూడా పవర్ స్టార్ అభిమానుల చేష్టలకు చిరాకు పడి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ అభిమానుల కారణంగా ఎక్కువ టార్చర్ అనుభవించేది మాత్రం రేణు దేశాయ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కూడా ఆమెను వదిన అంటూ సంభోదిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలాగే అకిరా నందన్, ఆద్య ఫోటోలను కూడా షేర్ చేస్తూ రేణుదేశాయ్ కి సంబంధం లేదనే విధంగా పోస్టులు పెడుతూ ఉండేవారు. తాజాగా అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో రేణు దేశాయ్ ఒక వీడియోస్ షేర్ చేశారు. దానిపై పవర్ స్టార్ అభిమాని ఒకరు మేడం ఒక్కసారైనా మా అకిరాని సరిగ్గా చూపించండి.

    Pawan Kalyan's son finished graduation at school- Know more | Film News Portal

    మా అన్న కుమారుడిని చూడాలని మాకు ఎంతో ఆశగా ఉంది అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. అకిరా నా కొడుకు.. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అవొచ్చు కానీ మాట్లాడే విధానం నేర్చుకోండి. ప్రతిసారి ఎందుకులే అని వదిలేస్తున్నా రెచ్చగొడుతూనే ఉన్నారు అని సీరియస్ గా రిప్లై ఇచ్చింది. అకిరా పుట్టినరోజు నాడైనా నన్ను ప్రశాంతంగా ఉంచండి. ఇలా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఇబ్బంది పెట్టొద్దు. 11 ఏళ్లుగా మీ టార్చర్ అనుభవిస్తున్న. తల్లిగా ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను అంటూ కామెంట్స్ చేసిన వారిపై సీరియస్ గా రియాక్ట్ అయిన వాటిని తన స్టేటస్ లో పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ లు వైరల్ గా మారాయి.