RC 15 : ఇండియన్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ గా పేరు తెచ్చుకున్న శంకర్ సినిమా ప్రకటించారంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డులు నమోదవబోతున్నాయో లెక్కలు వేసే వాళ్ళు అంచనాలకి మించి ఉంటారు. ఆయన ఎప్పుడు సినిమా తీసిన ఆ కథ 10 ఏళ్ళ తర్వాత వచ్చేదిగా ఉంటుంది. అందుకే ఆయన దర్శకత్వంలో ప్రతీ స్టార్ హీరో సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు. అటు రజనీకాంత్, కమల్ హాసన్, ఇటు మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు, బాలీవుడ్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఇలా ఎవరూ ఆయన సినిమాలో చేసే ఛాన్స్ వస్తే వదలరు.
గతంలో ఓసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా శంకర్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను అనుకొని డ్రాపయ్యారు. ఇప్పుడు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ క్రియేటివ్ జీనియస్ దిల్ రాజు ప్రొడక్షన్‌లో భారీ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఎవరూ ఊహించనిది. ఒక్కో పాటకే దాదాపు 12 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం వరకూ చిత్రీకరణ పూర్తైంది.
RC 15 : పవన్ గాని, చిరు గాని గెస్ట్ అపీరియన్స్..?
అయితే, వాస్తవంగా ఈ కథ చరణ్‌తో కాకుండా శంకర్, పవన్ కళ్యాణ్ హీరోగా చేయాలనుకున్నారట. కానీ, కథ విన్న దిల్ రాజు ఇందులో పవన్ కంటే చరణ్ అయితే బావుంటుందని చెప్పడంతో కథ చెర్రీ వద్దకి చేరింది. కథ విన్న చరణ్ బాగా నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది.
అయితే, చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ గనక శంకర్ అనుకున్నట్టు చేసుంటే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉండబోయోదో అని సోషల్ మీడియాలో, మెగా అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఆ పవర్ స్టార్‌తో ఈ క్రియేటివ్ జీనియస్ సినిమా తీస్తే హాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు. అక్కడ బాక్సాఫీస్ కూడా షేకయ్యేది అనడంలో సందేహం లేదు. చూడాలి మరి కనీసం ఆర్సీ 15 లో పవన్ గాని, చిరు గాని గెస్ట్ అపీరియన్స్ ఇస్తారేమో.