RBI: గత ఎన్నికలకు ముందు కేంద్రంలో బిజెపి సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనేది ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రారంభంలో ఎంతమంది ఆర్థిక నిపుణులు స్వాగతించిన తర్వాత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయం అనేది బిజెపిని ఓడిస్తుందని భావించిన అది సాధ్యం కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2000 నోట్లను తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ లోపు 2000 నోట్లు బయట ఎవరి దగ్గర ఉన్న వాటిని బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.
అలాగే ఇప్పటికీ 2000 నోట్ల ముద్రణ ఆపేసినట్లు పేర్కొంది. ఉన్నపళంగా ఇలా 2000 నోట్లని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే ఈ చర్యల వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాని వ్యాపారులు, రాజకీయ నాయకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో ఓట్లు కొనడం కోసం పెద్ద మొత్తంలో డబ్బుని ఎవరికి వారు దాచుకున్నారు. అయితే సెప్టెంబర్ వరకు ఆ నోట్లు చలామణిలో ఉంటాయని, ఆ లోపు అందరూ బ్యాంకు లలో డిపాజిట్ చేయాలని చెప్పడం ద్వారా ఇప్పుడు బ్లాక్ మనీ పరిస్థితి ఏంటి అనే టెన్షన్ అందరిలో మొదలైంది.
రెండు వేల నోట్ల ముద్రణని ఆర్బీఐ ఓ వైపు ఆపెయగా ఉన్నవాన్ని కూడా రాజకీయ నాయకులు, వ్యాపారుల దగ్గరకి వెళ్ళిపోయాయి. ఇప్పటికే 90% 2 వేల నోట్ల చలామణి తగ్గిపోయింది. అయితే ఇప్పుడు వారిదగ్గర ఉన్న మొత్తం బ్యాంకులలో డిపాజిట్ చేస్తే దానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఇక వేల చెప్పకపోతే తరువాత వాటిని రద్దు చేస్తే అసలుకే నష్టం వస్తుంది. దీనికి ఏం చేయాలా అనే ఆలోచనలో రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ధన ప్రభావం తగ్గించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కూడా విమర్శలు చేస్తున్నాయి.