Ravanasura Twitter Talk: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ మూవీలో రవితేజ కనిపించాడు. సినిమాలు హీరోలు లేరు అనే క్యాప్షన్ తో రావణాసుర మూవీని ప్రేక్షకులకి అందించారు. అలాగే మూవీలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, సరికొత్త కథతో, ఇప్పటి వరకు తెలుగులో రానటువంటి కథాంశంతో మూవీ ఉండబోతుంది అని ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏంటి అనేది ఎక్కడా కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఏకంగా ఐదు మంది హీరోయిన్స్ ఉన్నా కూడా ఎవరితో కూడా లవ్ స్టొరీ మూవీలో ఉండదని సుదీర్ వర్మ చెప్పారు.
కథలో భాగంగానే వారి పాత్రలు కనిపిస్తాయని క్లారిటీ ఇచ్చారు. సినిమాపై మొదటి నుంచి సస్పెన్స్ మెయింటేన్ చేసి మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అలాగే రవితేజ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ కూడా ఈ సినిమాకి జరగడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ ఎలా ఉంది అనే దానిపై ట్విట్టర్ లో ఫ్యాన్స్, ఫిల్మ్ క్రిటిక్స్ రివ్యూలు పెడుతున్నారు. సెకండాఫ్ టిస్టుల సూపర్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో బీజీఎం అదిరిపోయింది. ఇక సినిమా క్లైమాక్స్ స్ట్రాంగ్‌గా ఉంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా చూపించాడు అని ఓ నెటిజన్స్ తన అభిప్రాయాన్ని చెప్పారు.
దర్శకుడు సినిమా ప్లాట్‌ను చూపించిన విధానం సింప్లీ సూపర్బ్. ఇలాంటి రోల్స్ రవితేజ చేస్తారని అస్సలు అనుకోలేదు. తను అద్భుతంగా నటించాడు. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద ఎసెట్. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. రవితేజ నటనతో రావణాసుర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. డీసెంట్ ఫస్ట్ హాఫ్.. ఇంటర్వెల్ అదిరింది. ఇక సెకండాఫ్ అంతా రాణాసురగా రవితేజ నటనతో మంట పెట్టేశాడు. రవితేజకు మరో బ్లాక్ బస్టర్’ అంటూ పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి సినిమాలు తీయకు అన్నా.. నిప్పు, ఖిలాడీ సినిమాలు చూస్తున్నట్టే ఉంది. నీకు ఫెయిల్యూర్స్ రావాలని ఎవరూ కోరుకోరు. కానీ నువ్వు మాత్రం ఇలాంటి డిజాస్టర్స్ తీస్తున్నావ్ అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.