Rats: సాధారణంగా ఎలుకను చూస్తే ప్రతి ఒక్కరు ఆమడ దూరం పరిగెత్తుతారు.ఎలుక మనల్ని ఏమీ చేయకపోయినా అది ఇంట్లోకి చొరబడింది అంటే ఇల్లు మొత్తం పీకి పందిరి వేస్తుంది.ఇంట్లో సామాన్లు అన్నింటినీ పాడు చేయడమే కాకుండా బట్టలను కూడా పాడు చేస్తూ ఉంటుంది అందుకే ఇంట్లోకి ఎలుకలు రాకుండా చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక సమయంలో ఇంట్లోకి ఎలుకలు ప్రవేశిస్తూ ఉంటాయి.ఇలా ఇంట్లోకి వచ్చినటువంటి ఎలుకలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఇంట్లో విచ్చలవిడివిగా కనపడుతూ ఇల్లు మొత్తం పాడుచేస్తూ ఉంటాయి. అయితే ఇలా ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఉండాలన్న వచ్చిన ఎలుకలు బయటికి పారిపోవాలన్న ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.
ఇంట్లో ఎలుకల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో ఎలుకలు తిరిగే చోట కర్పూరం పెట్టడం వల్ల ఎలుకలు బయటకు వెళ్లిపోతాయి.ఎలుకలకు కర్పూరం వాసన అంటే ఏమాత్రం పడదు అందుకే ఎలుకలు తిరుగుతున్న చోట కర్పూరపు బిల్లలు వేయటం వల్ల ఎలుకలు బయటకు వెళ్తాయి అలాగే పుదీనా వాసన అంటే ఎలుకలకు ఏమాత్రం నచ్చదు అందుకే పుదీనా ఆయిల్ ఇంట్లో అక్కడక్కడ స్ప్రే చేయడం వల్ల ఈ వాసనకు ఎలుకలు ఇంటి నుంచి పారిపోవడం ఖాయం.
ఇక ఇంట్లో నుంచి ఎలుకలు బయటికి వెళ్లి పోవాలంటే పొగాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.గోధుమ పిండి లేదా శనగపిండి లోకి పొగాకు పొడిని వేసి గుళికలుగా చేసి ఎలుకలు తిరుగుతున్న చోట పెట్టడం వల్ల ఎలుకలు వాటి వాసనకు బయటకు వెళ్లిపోతాయి.ఇలా ఈ సింపుల్ చిట్కాలు ద్వారా ఎలుకలను మనం ఇంటి నుంచి బయటకు పారద్రోల వచ్చు అయితే ప్రస్తుతం రాట్ మ్యాట్ కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉన్నాయి.అయితే మనం వాటిని గమనించకుండా ఉంటే కనుక ఎలుకలు వాటిపై పడి చనిపోయి ఇల్లు మొత్తం కంపుకొడతాయి అందుకే ఈ సింపుల్ చిట్కాలతో ఇంటి నుంచి ఎలుకలను పారద్రోలవచ్చు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.