Rashmika Mandanna: ఇదేం వ్యాపారం మేడమ్

Rashmika Mandanna: టాలీవుడ్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తన కొత్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిన్న, మొన్న ఊదరగొట్టినట్లుగానే చివరకు తన కొత్త వెంచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘డియర్ డైరీ’ అనే పేరుతో ఓ ప్రత్యేకమైన పెర్‌ఫ్యూమ్ లైనప్‌ను లాంఛ్ చేసింది. ఇది సాదాసీదా బ్రాండ్ కాదని, తన జీవితంలో scent (పరిమళం) ఎంత ముఖ్యమో చెబుతూ.. ఇది తన వ్యక్తిత్వంలో ఓ భాగమని చెప్పుకొచ్చింది రష్మిక.

“పరిమళం నా జీవితం లో ఓ భాగం. ఇప్పుడు అదే పరిమళాన్ని మీ అందరితో పంచుకోవడం నన్ను చాలా ఉత్సాహపరుస్తోంది, అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీరు అందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలి,” అంటూ ఎంతో భావోద్వేగంతో తన పెర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రస్థావించింది.

rashmika-mandanna-enterd-into-perfume-business

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా..

ఈ లాంఛనానికి సెలబ్రిటీలు, అభిమానులు మంచి స్పందన ఇచ్చారు. విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా ఆమెకు బలంగా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ ఆన్‌లైన్ అమ్మకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వేదికగా ఎంపికైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉండగా, ఒక్కో బాటిల్ గరిష్ట ధర రూ.2599 గా ఉంది.

ఇక త్వరలోనే ఫిజికల్ ఔట్‌లెట్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రష్మిక ఈ వ్యాపారంతో తన అభిరుచిని, వ్యక్తిత్వాన్ని, ఎమోషనల్ కనెక్ట్‌ను ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటోంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌లోనే కాదు ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ సెక్టార్‌లోనూ రష్మిక తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.