Ramgopal Varma : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం వర్మ గురించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటారు. చేసే పనిలోనే కాదు మాటలతో వివాదాలు సృష్టించడంలో వర్మకు ఆయనే సాటి. మరెవరు రారు పోటీ. అందుకే వర్మ ఓ తోపు అంటారు ఆయన అభిమానులు. ఒకప్పుడు దెయ్యాల సినిమాలతో భయపెట్టిన వర్మ, ఇప్పుడు రొమాంటిక్ చిత్రాలు తీస్తూ బోల్డ్ గా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు యాంకర్లతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ అమ్మాయిలపై తనకున్న అభిప్రాయాలను చెబుతున్నాడు. అమ్మాయిలతో టైం పాస్ చేయడానికి వర్మ ఈ మధ్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మాయిల అందాలను పొగుడుతూ.. వారితో బోల్డ్‌గా మాట్లాడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు వర్మ.
అయితే లేటెస్టుగా వర్మ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన చేసిన ఓ పని చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. పిచ్చి కాస్త ముదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆర్జీవీకి దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఆమె అందానికే ఆయన ఓ బానిస. ఆమెకు పరమ భక్తుడు వర్మ. సందర్భం దొరికిన ప్రతిసార శ్రీదేవీపై తనకున్న ప్రేమను పబ్లిక్ గానే చెబుతుంటాడు వర్మ. ఆమె మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అని, దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అప్పట్లో కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ శ్రీదివిని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అది కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చనిపోయిన శ్రీదేవితో కారులో హాయిగా షికారు చేస్తున్నా అని ఓ ఫోటోను మార్ఫింగ్ చేసి తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో శ్రీదేవి డ్రైవింగ్ సీటులో కూర్చుంది. వర్మ ఆమె పక్కనే కూర్చొని సిగరేట్ తాగుతూ కనిపించాడు. అంతే కాదు శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్తున్నా అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు వర్మ. ఇక ఇది మా కర్మ అంటూ నెటిజన్స్ పిచ్చి తిట్లు తిడుతున్నారు. ప్రస్తుతం ఈ వారత్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.