Ramcharan-Saipallavi : లక్కీ ఛాన్స్ కొట్టేసిన న్యాచురల్ బ్యూటీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Ramcharan-Saipallavi : గత రెండు మూడు రోజులుగా సాయి పల్లవికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది అంటూ ఫాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా స్క్రీన్ కి దూరంగా ఉన్న సాయి పల్లవిని వెండి ధర మీద చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమెను పాపం బాగా మిస్ అవుతున్నారట. సాయి పల్లవి ఆ సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో నటిస్తోందంటూ రోజుకో వార్త ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యనే బ్యూటీ ముంబైలో కనిపించడంతో రామాయణం సినిమా కన్ఫామ్ అయ్యిందని త్వరలోనే షూటింగ్ జరుగుతుందంటూ వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా సాయి పల్లవికి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ramcharan-saipallavi-natural-beauty-is-going-to-act-in-mega-power-star-movie

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాచేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన సినిమా కావడంతో ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ ఫాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి కాగానే చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఆర్సీ 16. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో ఎవరెవరు నటిస్తున్నారని విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

ramcharan-saipallavi-natural-beauty-is-going-to-act-in-mega-power-star-movie

ఆర్సీ 16 మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో కీలక పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నాడట. లేటెస్టుగా ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో చరణ్ జోడీగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని ఇన్ఫర్మేషన్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు బుజ్జి బాబు న్యూస్ చేయలేదు మరి ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. చరణ్, సాయి పల్లవి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతారు.

ramcharan-saipallavi-natural-beauty-is-going-to-act-in-mega-power-star-movie

ప్రస్తుతం చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు . మరోవైపు ఆర్సీ16 కి రెడీ అవుతున్నాడు. పట్టాలెక్కుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే అప్పట్లో ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను చరణ్ కి జోడిగా తీసుకోనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కృతి సనన్ హీరోయిన్ అంటూ టాక్ వినిపించింది. ఇప్పుడేమో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ మూవీలో ఎవరు హీరోయిన్ అనేది మాత్రం బుచ్చి బాబే అనౌన్స్ చేయాలి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

4 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

6 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.