Payal Rajput : అతనితో మళ్లీ చేయాలని ఉంది..కానీ..

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ఈ భామకు పరిచయం అవసరం లేదు. తన ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ 100 తో పాయల్ తెలుగు కుర్రాళ్ల మనసును దోచేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయాయి. అయితే తాజాగా తనుకు విజయాన్ని అందించిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో మళ్లీ పని చేసింది ఈ బ్యూటీ. మంగళవారం మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించునుంది. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం సంగతులతో పాటు తన క్యారెక్టర్ గురించిన విషయాలను తాజాగా పాయల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

payal-rajput-want-to-act-with-rx100-hero-again

ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ..” అజయ్ భూపతితో ఇది నాకు రెండో సినిమా. నేనే అజయ్‌కి కాల్ చేసి ఛాన్స్ ఇవ్వాలని అడిగాను. క్యారెక్టర్‌ వచ్చినప్పుడు కచ్చితంగా ఇస్తానన్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్లకు నన్ను తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. అలా మంగళవారం మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ లో ఇది సెన్సేషనల్ మూవీ గా నిలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి పాత్రతో ఇప్పటివరకు ఎవరూ మూవీ చేయలేదు.

payal-rajput-want-to-act-with-rx100-hero-again

శైలూ పాత్ర ఎన్నో ఎమోషన్స్ కలిగిన పాత్ర. శైలూ విలన్ కాదు. సినిమా చూస్తే శైలు పై సానుభూతి పెరుగుతుంది. ఇప్పటివరకు నా కెరీర్ లో చాలా ఇంటెన్సివ్ రోల్స్ చేశాను కానీ ఇది వేరే లెవెల్. కథ విన్నాక ఫ్లాట్ అయిపోయా వెంటనే అజయ్ తో పనిచేస్తున్నానని అమ్మకు చెప్పాను.ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ ఏకంగా 30 నుంచి 35 మంది అమ్మాయిల ఆడిషన్స్ చేశారట. ఈ ఆడిషన్స్ గురించి తెలుసుకొని నేనే కాల్ చేశాను. నన్ను తీసుకోవచ్చు కదా అని అడిగాను. ఎందుకంటే అజయ్ టాలెంట్ ఏంటో నాకు తెలుసు అందుకే ఉండబట్టలేక అడిగాను. దీంతో అజయ్ నా గురించి ఆలోచించి ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేశారు.

payal-rajput-want-to-act-with-rx100-hero-again

‘మంగళవారం’ సినిమా చూసినప్పుడు కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు. ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు. ఇక ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయతో మళ్లీ యాక్ట్ పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ అది కుదరడం లేదు. మేమిద్దరం కలిసి పని చేయాలి అంటే మంచి కథ దొరకాలి. అప్పుడే మా ఇద్దరికీ వర్కౌట్ అవుతుంది”అని పాయల్ తెలిపింది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.