Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగితేలుతోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనలకు కవల పిల్లలు జన్మించారు. ఈ శనివారం (జనవరి 31) హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చింది. ఈ ట్విన్స్ లో ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్(X) ద్వారా తెలిపారు.

ఈ మేరకు చిరు.. “ఎంతో సంతోషంతో, కృతజ్ఞతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ (ఒక బాబు, ఒక పాప) పుట్టారు” అని వెల్లడించారు. అంతేకాదు, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, ప్రస్తుతం అంతా క్షేమమేనంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తాతయ్య, నానమ్మలుగా ఈ చిన్నారులను మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ఇదొక దైవాశీర్వాదమని చిరంజీవి ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక, మా కుటుంబంపై ప్రేమను కురిపిస్తూ, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు..అని చిరంజీవి తెలిపారు.

ram-charan-upasana-are-blessed-with-twins-chiranjeevi-confirms-this-through-social-media

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు

మొత్తానికి, రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లోనూ ఆనందకరమైన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇంతకముందు రామ్ చరణ్, ఉపాసనలకు ఒక పాప పుట్టిన సంగతి తెలిసిందే. ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఈ దంపతులు మరో ఇద్దరు బిడ్డలకి తల్లితండ్రులవడం విశేషం. ఇక, రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. 2026, మార్చి 27న ఈ మూవీ రిలీజ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. 2026 ప్రారంభంలో అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీతో సాలీడ్ హిట్ కొట్టిన మెగాస్టార్..కూతురు సుష్మితకి నిర్మాతగా మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చరణ్, ఉపాసన దంపతులు ఇద్దరు బిడ్డలకి జన్మనివ్వడంతో పండుగ వాతావరణం నెలకొంది. మొత్తానికి, 2026 మెగా ఫ్యామిలీకి మంచి శుభారంభం అని చెప్పాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 day ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 day ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 day ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

3 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

5 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

6 days ago

This website uses cookies.