Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడం విశేషం. త్రిష కృష్ణన్ కి లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన అవకాశం. ఇక, దర్శకుడు మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, ఎందుకు విడుదల వాయిదా పడిందో అందరికీ తెలిసిందే.
విశ్వంభర సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఏ ఒక్కరినీ అంతగా మెప్పించలేకపోయింది. దీనికి కొందరు అనుభవం సరిపోలేదని అంటే మరికొందరేమో ఇలాంటి జోనర్ సినిమాతో రిస్క్ చేయడమెందుకు అని కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఒక్క టీజర్ ఈ మూవీపై పలు సందేహాలు వచ్చేలా చేసింది. దాంతో, చిత్ర బృందం విశ్వంభర సినిమాను అందరికీ నచ్చేలా తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా విషయంలో ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.
మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా 300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మెగా 158 మూవీ కోసం చిరు రెడీ అవుతున్నారు. మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ చేసేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా, మెగాస్టార్ సినిమాల విషయంలో వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. అలాగే, విశ్వంభర ఏమైంది అనే మాట కూడా వినిపిస్తోంది. దీనికి తాజాగా యూవి క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన అజయ్ కుమార్ అప్‌డేట్ ఇచ్చాడు.
మొదటగా వచ్చిన టీజర్ వీఎఫెక్స్ పరంగా మెప్పించలేకపోయింది. ఒక పెద్ద స్టార్ సినిమాకి స్టార్టింగ్‌లోనే ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తే పొరపాటే. అందుకే, సినిమా ఆలస్యం అయినా అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వీఎఫెక్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. త్వరలో, టీజర్ 2తో మిమ్మలిని సర్‌ప్రైజ్ చేస్తామని తెలిపారు. మొత్తానికి, ఫస్ట్ టీజర్ విషయంలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నట్టే. చూడాలి, మరి మెగా అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.